అనన్య కాస్టింగ్ కౌచ్ బాధితురాలేనా.. కమిట్మెంట్ ఇవ్వడంపై సీరియస్ ?
ముఖ్యంగా 2019 సంవత్సరంలో మల్లేశం సినిమాతో పాపులారిటీ సంపాదించుకుంది అనన్య నాగళ్ళ. ఈ సినిమా ద్వారా ఉత్తమ మహిళ సీమ అవార్డు కూడా దక్కించుకుంది. ఆ తర్వాత ప్లే బ్యాక్, వకీల్ సాబ్,మాస్ట్రో, ఊర్వశివో రాక్షసివో, శకుంతలం లాంటి ఎన్నో సినిమాలలో కీలక పాత్రల్లో కనిపించింది. అయితే తాజాగా పోటెలు లో హీరోయిన్గా మెరిసింది అనన్య నాగళ్ళ. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో విపరీతంగా తిరుగుతున్నారు నటి అనన్య నాగళ్ళ.
విమానాల్లో ప్రచారం చేయడం... ఇంటర్వ్యూలో పాల్గొనడం జరుగుతుంది. ఈ తరుణంలోనే హీరోయిన్ అనన్య నాగళ్లకు.. ఓ రేర్ సిచువేషన్ ఎదురయింది. మీరు కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నారా అని ఓ జర్నలిస్టు ఆమెను అడిగారు. అయితే దీనిపై చాలా సీరియస్ గా స్పందించారు అనన్య నాగళ్ళ. తాను ఇంతవరకు అలాంటి సమస్యను ఎక్కడ ఎదుర్కోలేదని తేల్చి చెప్పారు. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది 100% అబద్ధమని ఆమె పేర్కొన్నారు.
వేరే వాళ్ళ విషయం తనకు తెలియదని.. తన విషయంలో ఇంతవరకు ఎదుర్కోలేదని వివరించింది. అవకాశం ఇచ్చే ముందు కమిట్మెంట్ ఇవ్వాల్సిందే అనేది అవాస్తవమని ఆమె చెప్పడం జరిగింది. అలాగే సోషల్ మీడియాలో కూడా విపరీతంగా... ట్ర్రోలింగ్ కూడా చేస్తారని ఆమె వివరించింది. అయితే ఈ ట్రోలింగ్ 50% మంచిదే ఉంటుందని కొంత చెడు ఉంటుందని వివరించారు. అదే సమయంలో ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అనన్య. ఆయన పెద్ద స్టార్ హీరో అని... మహిళల కోసం పోరాడే వ్యక్తి అని కొనియాడారు.