బ్యాడ్ లక్: ఆ విషయంలో ఇప్పటికి ఫీల్ అవుతున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్.!

FARMANULLA SHAIK
మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన సినిమాల్లో ఆల్ టైం సూపర్ హిట్ మూవీ ఏది అంటే చెప్పే సినిమాల్లో రాజా ది గ్రేట్ సినిమా ఒకటి. టాలీవుడ్ సక్సెస్ ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో రవితేజ అంధుడి పాత్రలో నటించాడు. ఈ సినిమా అద్భుతంగా నటించి మెప్పించారు. ఈ మూవీలో రవితేజ సరసన మెహరీన్ హీరోయిన్ గా నటించింది. అలాగే ప్రకాష్ రాజ్, రాధిక ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మించాడు. సాయి కార్తీక్ సంగీతం అందించాడు. ఈ సినిమా తర్వాత రవితేజ  ఆ రేంజ్ హిట్ అందుకోలేకపోయారు. ఇదిలా ఉంటే రాజా ది గ్రేట్ సినిమాకు ముందుకుగా మరో హీరోను అనుకున్నాడట దర్శకుడు అనిల్.ఇది చాలా ఏళ్ల క్రితం నాటి మాట. 'నేను శైలజ' సినిమాతో రామ్‌ ఎన్నాళ్లో వేచిన విజయం అందుకున్న రోజులవి. ఆ సమయంలో ఆయనతో అనిల్‌ రావిపూడి ఓ సినిమా చేస్తారు అని వార్తలొచ్చాయి.సినిమా మొదలుపెట్టాస్తారు అనే మాటలు కూడా వినిపించాయి. అయితే కథ విషయంలో ఇబ్బందులు వచ్చిన ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. అయితే వీటిలో అన్నీ సమాచారాలు.. ఎక్కడా ఎలాంటి క్లారిటీలు లేవు. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత ఈ ప్రాజెక్ట్‌ గురించి కొన్ని వివరాలు బయటకు వచ్చాయి.రవితేజతో అనిల్‌ రావిపూడి చేసిన 'రాజా ది గ్రేట్‌' సినిమా కథ తొలుత రామ్‌కి చెప్పారట. 

తొలుత అంతా ఓకే అనుకుని ముందుకెళ్లిన ఈ ప్రాజెక్ట్‌ విషయంలో ఆ తర్వాత వచ్చిన కొన్ని క్రియేటివ్‌ డిఫరెన్స్‌ల వల్ల ఆగిపోయారట. ఈ విషయాన్ని దర్శకుడు అనిల్‌ రావిపూడినే చెప్పుకొచ్చారు. రామ్‌ వెనక్కి తగ్గడంతో సినిమాను రవితేజతో చేశామని తెలిపారు. దీంతో 'రాజా ది గ్రేట్'  సినిమాను ఎలా మిస్ చేసుకున్నావ్ అంటూ రామ్‌ను అడుగుతున్నారు ఫ్యాన్స్‌.సగటు టాలీవుడ్‌ హీరోలు ఇలాంటి కథలు చేయడానికి ఒప్పుకోని పరిస్థితి ఇప్పటికీ ఉంది. అయితే ప్రయోగానికి ఫిదా అయ్యి రవితేజకు విజయం అందించారు. అయితే 'రాజా ది గ్రేట్' కథను యాజ్‌ ఇట్‌ ఈజ్‌ రామ్‌కి చెప్పలేదట. అప్పటి వెర్షన్ వేరట. ఇప్పుడున్న వెర్షన్‌లో ఓ అమ్మాయిని కాపాడే బ్లైండ్ కుర్రాడి కథను చూపించారు. గతంలో జరిగిన ఓ విషయానికి ప్రస్తుతానికి లింక్‌ పెట్టారు.కానీ రామ్‌కి చెప్పిన కథలో ఫక్తు ప్రేమ కథ ఉండేదట. డార్జిలింగ్‌లో మొదలయ్యే పాత వెర్షన్‌లో హీరో బ్లైండ్.. ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డాక ప్రాబ్లెమ్ వస్తే.. ఎలా సాల్వ్ చేశాడనేది అప్పటి కథ. అయితే కథ నచ్చకనో, టెక్నికాలిటీస్‌ నచ్చకనో అప్పట్లో రామ్‌ వెనక్కి తగ్గాడు. ఆ తర్వాత 'హైపర్‌' సినిమాను ఓకే చేసుకొని సెట్స్‌పైకి తీసుకొచ్చారు.ఈ నేపథ్యంలో కొన్ని టెక్నీకల్ ఇష్యుస్ వల్ల ఆ ప్రాజెక్ట్ ఆపేయాల్సి వచ్చింది. ప్రొడక్షన్ విషయంలో కన్ఫ్యూజన్ లో పడి అది సెట్ కాలేదు. అది సెట్ అయ్యేలోగా రామ్ హైపర్ సినిమా రిలీజ్ అయ్యింది. మళ్లీ వెంటనే కమర్షియల్ సినిమా చేయడానికి రామ్ ఆలోచించాడు అని చెప్పుకొచ్చారు అనిల్ రావిపూడి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: