సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది నటీనటులు కొన్ని సినిమాలను కొన్ని కొన్ని కారణాల వల్ల వదిలేస్తుంటారు. కొంత మంది సినిమా కథ నచ్చిన ఆ సమయంలో ఇతర మూ వీలతో బిజీగా ఉండడం వల్ల కొన్ని సినిమాలను రిజెక్ట్ చేస్తూ ఉంటారు. మరి కొంత మంది కథ అద్భుతంగా ఉన్న తమ ఈమేజ్ కి ఆ స్టోరీ సరిపోదు అని రిజెక్ట్ చేస్తూ ఉంటారు. మరి కొంత మంది కథ నచ్చకనే మూవీ లను రిజెక్ట్ చేస్తూ ఉంటారు. ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి కూడా ఇలా ఓ చిన్న కారణంతో ఓ సినిమాను రిజెక్ట్ చేసినట్లు తెలుస్తుంది. ఆ సినిమా ఏది .? దానిని ఎందుకు రిజెక్ట్ చేశాడు .? ఆ తర్వాత ఆ సినిమా రిజల్ట్ ఎలా ఉంది అనేది వివరాలను తెలుసుకుందాం.
చాలా సంవత్సరాల క్రితం నాగార్జున హీరోగా శ్రీదేవి హీరోయిన్ గా ఆఖరి పోరాటం అనే మూవీ వచ్చింది. ఈ సినిమాకు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వం వహించగా అశ్విని దత్ ఈ సినిమాను నిర్మించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం అందుకుంది. ఇది ఇలా ఉంటే మొదట ఈ సినిమాలో హీరో పాత్ర కోసం మెగాస్టార్ చిరంజీవి ని ఈ మూవీ బృందం వారు అనుకున్నారట. అందులో భాగంగా చిరంజీవి కి ఈ సినిమా కథ మొత్తం కూడా వినిపించారట. కథ మొత్తం అద్భుతంగానే ఉన్న శ్రీదేవి పాత్ర మాత్రం కాస్త ఎక్కువగా ఉంది అనే ఆలోచనతో చిరంజీవి ఈ సినిమా చేయను అని చెప్పాడట. దానితో ఈ మూవీ బృందం వారు నాగార్జున ను కలవడం , ఆయనకు కథను వినిపించడం చేశారట. ఆయనకు కథ బాగా నచ్చడంతో ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇలా చిరంజీవి రిజెక్ట్ చేసిన స్టోరీ తో నాగార్జున బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నట్లు తెలుస్తోంది.