ముందే చేయాల్సింది.. ఇప్పుడు కష్టం.. బాధపడుతున్న మహేష్ ఫ్యాన్స్..!!

murali krishna
సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల అయి మంచి విజయం సాధించింది.. ప్రస్తుతం మహేష్  తన తరువాత సినిమాపై ఫోకస్ పెట్టాడు.  మహేష్ తన తరువాత సినిమాను దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో చేస్తున్న సంగతి తెలిసిందే.. ఆర్ఆర్ఆర్ వంటి బిగ్గెస్ట్ హిట్ తరువాత రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాకు గ్లోబల్ వైడ్ గా మంచి అంచనాలు ఏర్పడ్డాయి.. మహేష్ ఈ సినిమా కోసం తన లుక్ ను మార్చుకున్నారు.. గుబురు గడ్డంతో మహేష్ లుక్  అదిరిపోయింది.. రాజమౌళి సినిమా కోసం మహేష్ జిమ్ లో తెగ కష్టపడుతున్నాడు.. ఇదిలా ఉంటే మహేష్ ఫ్యాన్స్ నుంచి సరికొత్త డిమాండ్ వినిపిస్తుంది.. రాజమౌళి సినిమా అంతే మినిమం మూడు సంవత్సరాలు ఉంటుంది.. దీనితో ఈ మూడు సంవత్సరాలు మహేష్ ఎలాంటి సినిమాలో నటించకూడదు.. దీనితో మహేష్ ఫ్యాన్స్ కాస్త నిరాశకు గురయ్యారూ.. 

మహేష్ రాజమౌళి సినిమా మొదలయ్యే లోపు చిన్న సినిమా అయినా చేసి ఉంటే బాగుంటుంది అని ఫ్యాన్స్ భావిస్తున్నారు.. కానీ రాజమౌళి సినిమా కోసం మహేష్ లుక్ చేంజ్ అయింది. దీనితో మళ్ళీ వేరే సినిమా చేయడం కష్టమని తెలుస్తుంది.. దీనితో మహేష్ సినిమా కోసం ఫ్యాన్స్ మూడు సంవత్సరాలు ఎదురు చూడాల్సిందే.. రాజమౌళి తో మహేష్  సినిమా జనవరి లో గ్రాండ్ గా మొదలు కానుందని సమాచారం. త్వరలోనే బిగ్ ప్రెస్ మీట్ ద్వారా రాజమౌళి ఆ సినిమా గురించి డిటైల్డ్ గా వివరించబోతున్నారు.. ఈ సినిమా ను బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీ గా రాజమౌళి తెరకెక్కిస్తున్నారు..మహేష్ కోసం రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ అద్భుతమైన కథ అందించినట్లు తెలుస్తుంది. మహేష్ బాడీ లాంగ్వేజ్ తగ్గట్లుగా రాజమౌళి ఆ సినిమా ను మలచనున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: