ఆలియా "జిగ్రా" టార్గెట్ కొండంత.. మొదటి వారంలో వచ్చింది అంతే..?

Pulgam Srinivas
హిందీ సినీ పరిశ్రమలో తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న యువ నటీమణులలో ఆలియా భట్ ఒకరు. ఈమె కేవలం కమర్షియల్ సినిమాలలో నటించి తన అందచందాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడం మాత్రమే కాకుండా ఎన్నో వైవిధ్యమైన సినిమాలలో నటించి తన నటనతో కూడా ప్రేక్షకులను అదరగొట్టిన సందర్భాలు ఉన్నాయి. కొంత కాలం క్రితం ఈమె సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో గంగుబాయి కతియవాడి అనే లేడీ ఓరియంటెడ్ మూవీ లో ప్రధాన పాత్రలో నటించింది. ఇక ఈ సినిమాలో ఆలియా తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది.

ఈ సినిమాతో ఆలియా క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇకపోతే కొన్ని సంవత్సరాలు క్రితం ఈమె రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రూపొందిన ఆర్ ఆర్ ఆర్ సినిమాలో రామ్ చరణ్ కి జోడిగా ఆలియా నటించింది. ఈ మూవీ సూపర్ సక్సెస్ అయ్యింది. ఈ సినిమా ద్వారా కూడా ఈమె క్రేజ్ చాలా వరకు పెరిగింది. ఇది ఇలా ఉంటే ఆలియా తాజాగా జిగ్రా అనే లేడీ ఓరియంటెడ్ సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మంచి టాక్ వచ్చింది. కానీ ఈ సినిమా మాత్రం ఆ టాక్ కి తగ్గ రీతిలో కలెక్షన్లను రాబట్టలేక పోతుంది.

తాజాగా ఈ మూవీ కి సంబంధించిన మొదటి వారం రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయింది. మొదటి వారం పూర్తి అయ్యే సరికి ఈ సినిమా 22.40 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్లను వసూలు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా 65 నుండి 70 కోట్ల టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగినట్లు తెలుస్తుంది. మరి ఇంత పెద్ద టార్గెట్ కు మొదటి వారంలో వచ్చిన కలెక్షన్లను బట్టి చూస్తే ఈ మూవీ భారీ అపజయాన్ని అందుకునే అవకాశాలు కనిపిస్తున్నట్లు కొంత మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: