ఆర్ఆర్ఆర్ : జపాన్లో సరికొత్త రికార్డు.. ఒకే థియేటర్లో ఏకంగా అన్ని నెలలు..?

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ కలిగిన హీరోలు అయినటువం టి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా ఆర్ ఆర్ ఆర్ అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే . ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్న దర్శకులలో ఒకరు అయినటువంటి ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించగా ... ఈ మూవీ లో రామ్ చరణ్ కి జోడిగా ఆలియా భట్ , జూనియర్ ఎన్టీఆర్ కి జోడీగా ఒలివియా మోరిస్ నటించారు. ఈ సినిమాకు v VIJAYENDRA PRASAD' target='_blank' title='విజయేంద్ర ప్రసాద్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">విజయేంద్ర ప్రసాద్ కథను అందించగా ... ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించాడు.

డి వి వి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత డి వి వి దానయ్య ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించాడు. ఈ సినిమాలో అజయ్ దేవగన్ , శ్రేయ , సముద్ర ఖని ముఖ్య పాత్రలలో నటించారు. ఇకపోతే ఈ సినిమా చాలా భాషలలో విడుదల అయ్యి అద్భుతమైన విజయం సాధించిన కొంత కాలానికి ఈ మూవీ ని జపాన్ లో కూడా బారి ఎత్తున విడుదల చేశారు. ఇక ఈ సినిమాకు జపాన్ ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఇది ఎలా ఉంటే జపాన్ లో తాజాగా ఆర్ ఆర్ ఆర్ సినిమా సరికొత్త రికార్డును సృష్టించింది.

తాజాగా ఈ మూవీ బృందం జపాన్ లో ఆర్ ఆర్ ఆర్ సినిమా ఒక సంవత్సరం తొమ్మిది నెలల పాటు నిర్విరామంగా ఒక థియేటర్లో ప్రదర్శించబడుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. జపాన్ లో ఇప్పటికి కూడా ఆర్ ఆర్ ఆర్ మూవీ అద్భుతమైన రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నట్లు దీని ద్వారా తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rrr

సంబంధిత వార్తలు: