ప‌వ‌న్ కళ్యాణ్ సినిమాల‌ టైటిల్స్‌తో సినిమాలొస్తున్నాయ్‌...!

RAMAKRISHNA S.S.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు.. ఇటు సినిమాలతో పాటు, అటు రాజకీయాల్లోనూ బిజీబిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్.. నటిస్తున్న మూడు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. వీటిలో ముందుగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు రిలీజ్ కానుంది. ఈ సినిమా స‌మ్మ‌ర్ లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. ఆ తర్వాత సుజిత్ దర్శకత్వంలో గ్యాంగ్ స్టార్ కథాంశంతో తెరకెక్కుతున్న ఓజి సినిమా రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్‌ భగత్‌సింగ్ సినిమా కూడా సెట్స్ మీదకు వెళ్లనుంది.

ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ గతంలో నటించిన సినిమాల టైటిల్స్ ఇప్పుడు వాడుతున్నారు. పవన్ కళ్యాణ్ కెరీర్‌లో తిరుగులేని క్లాసిక్ సినిమాలలో ఒకటిగా నిలిచిన తొలిప్రేమ టైటిల్ను మళ్లీ అదే మెగా ఫ్యామిలీకి చెందిన వరుణ్ తేజ్ వాడుకొని సూపర్ హిట్ కొట్టాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో హీరో కూడా పవన్ కళ్యాణ్ తొలి సినిమా టైటిల్ వాడుకుంటున్నారు. ప్రదీప్ మాచరాజు వెండితెరపై 30 రోజుల్లో ప్రేమించడం ఎలా ? అనే సినిమాతో హీరోగా సందడి చేశాడు. ఇప్పుడు కాస్త గ్యాప్ తర్వాత ప్రదీప్ తన రెండో సినిమా ఎనౌన్స్ చేశాడు.

నితిన్ , భరత్‌ దర్శకత్వంలో ఫ్యామిలీ సినిమాలో ప్రదీప్ మాచరాజు హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో మరో బుల్లితెర యాంకర్ దీపిక పిల్లి హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేశారు. ఈ సినిమాకు అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇదే టైటిల్ తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలి సినిమా తెరకెక్కింది. ఇప్పుడు పవన్ టైటిల్ ప్రదీప్ మాచరాజు వాడుకుని ప్రేక్షకుల్లో ఆసక్తి క్రియేట్ చేశారు. అలాగే పవన్ కళ్యాణ్ నటించిన మరో సినిమా బాలు సినిమా టైటిల్ కూడా.. వాడుకునేందుకు ఒక హీరో ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: