ఒక మెట్టు దిగి సుకుమార్ నే స్వయంగా ఇంటికి వెళ్లి అడిగిన..ఆ ఆఫర్ రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్ ఈమె..!

Thota Jaya Madhuri
సుకుమార్ ఏ విషయానైనా సరే పక్క ప్లానింగ్ తో చేస్తాడు అంటూ ఇండస్ట్రీలో ఉండే వాళ్ళు కూడా చెప్పుకొస్తుంటారు . ఆయనతో వర్క్ చేసిన నటీనటులు కూడా సుకుమార్ ని ఓ రేంజ్ లో పొగిడేస్తూ ఉంటారు . వన్స్ ఒక హీరోయిన్ కి ఈ క్యారెక్టర్ బాగుంటుంది అని ఆయన డిసైడ్ అయితే ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే ఆ హీరోయిన్ ని ఆ పాత్రకు ఒప్పించడానికి బాగా బాగా కష్టపడతాడు సుకుమార్.  అయితే సుకుమార్ కి షాక్ ఇచ్చింది ఒక స్టార్ హీరోయిన్ . ఎంతలా అంటే అంత పెద్ద స్టార్  ఒక మెట్టు దిగి సుకుమార్ ఆమె ఇంటికి వెళ్లి అడిగినా కూడా ఆమె ఆ ఆఫర్ ని సున్నితంగా రిజెక్ట్ చేసింది .


సుకుమార్ ఖాతాలో ఎన్నో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నాయి . కానీ ప్రజెంట్ సుకుమార్ ని పాన్ ఇండియా స్థాయిలో నిలబెట్టేలా చేసిన సినిమా మాత్రం "పుష్ప" అనే చెప్పాలి. అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా పుష్ప.  ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయింది అన్న విషయం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు . ప్రెసెంట్ పుష్ప 2 సినిమా సెట్స్ పై ఉంది .


అంతేకాదు ఈ సినిమా డిసెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది . అయితే ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం హీరోయిన్ సాయి పల్లవి ని చూస్ చేసుకున్నారట సుకుమార్ . అంతేకాదు ఆమె అంటే ఎంత రెస్పెక్ట్ అనేది ఒకనాడు ఒక ఈవెంట్లో స్టేజిపై మాట్లాడాడు . అంత పెద్ద డైరెక్టర్ ఏకంగా సాయిపల్లవి ఇంటికి వెళ్లి మరి ఆఫర్ ఇచ్చినా కూడా ఆమె ఈ ఆఫర్ ని రిజెక్ట్ చేసిందట . దానికి కారణం ఈ పాత్ర ఆమెకు నచ్చకపోవడమే.  కోట్లు ఆఫర్ చేసినా సాయి పల్లవి ఆ పాత్ర రిజెక్ట్ చేసిందట . ఈ న్యూస్ సుకుమార్ ఫ్యాన్స్ ను తీవ్రంగా హర్ట్ చేసింది . అంత పెద్ద స్టార్ ఇంటికి వచ్చి అడిగినా కూడా సాయి పల్లవి ఓకే చెప్పకపోవడం ఏంటి అంటూ ఆమెపై టోలింగ్ కూడా చేశారు . ప్రెసెంట్ నాగచైతన్యతో తండేల్  సినిమా షూట్ లో బిజీగా ఉంది హీరోయిన్ సాయి పల్లవి..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: