మోక్ష‌జ్ఞ కోసం బాల‌య్య ల‌క్కీ హీరోయిన్‌ను దించుతున్నారుగా..?

RAMAKRISHNA S.S.
- బాల‌య్య తో రెండు సినిమాల్లో న‌టించిన శోభ‌న‌
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .

నందమూరి బాలకృష్ణ వారసుడు నంద‌మూరి మోక్షజ్ఞ వెండితెరకు హీరోగా పరిచయం అవుతున్నాడు. ఐదారు సంవ‌త్స‌రాల నుంచి కూడ‌కా మోక్ష‌జ్ఞ డెబ్యూ మూవీపై పెద్ద ఎత్తున చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. అయితే ఎట్ట‌కేల‌కు విజ‌య‌వంత‌మైన సినిమాల ద‌ర్శ‌కుడు ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో మోక్షజ్ఞ తన తొలి సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి తాజాగా సినీ సర్కిల్స్‌లో ఓ ఇంట్ర‌స్టింగ్ న్యూస్‌ జోరుగా చక్కర్లు కొడుతోంది.

మోక్షజ్ఞ నటిస్తున్న ఈ సినిమాలో హీరో తల్లి పాత్రకు చాలా ఇంపార్టెన్స్‌ ఉంటుందట. ఈ కీల‌క మైన త‌ల్లి పాత్రలో నటించేందుకు చాలా మంది పేర్లు పరిశీలించాడ‌ట ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ‌. ఎట్ట‌కేల‌కు అలనాటి హీరోయిన్ శోభన అయితే, ఈ పాత్రకు పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుందని ఆమెను సంప్రదించారని స‌మాచారం. ఇక శోభ‌న చాలా చాలా లాంగ్ గ్యాప్ త‌ర్వాత తెలుగులో రీసెంట్ గా వ‌చ్చిన ప్ర‌భాస్ పాన్ ఇండియా బ్లాక్ బ‌స్ట‌ర్ ‘ కల్కి 2898 ఎడి ’ సినిమాలో నటించింది. ఇప్పుడు మోక్షజ్ఞ సినిమాలో తల్లి పాత్రకు ఆమెను సంప్రదించడంతో ఆమె వెంటనే ఈ సినిమా లో చేస్తాన‌ని మాట ఇచ్చిన‌ట్టు తెలిసింది.

గతంలో శోభ‌న మోక్షు తండ్రి బాల‌య్య తో క‌లిసి రెండు సినిమాలు చేసింది. నందమూరి బాలకృష్ణతో కలిసి ‘నారి నారి నడుమ మురారి’ - ‘మువ్వ గోపాలుడు’ వంటి సినిమాల్లో నటించింది. ఇప్పుడు బాలయ్య తనయుడితోనూ నటిస్తుందని వార్తలు రావ‌డంతో నంద‌మూరి అభిమానుల ఆనందానికి అవ‌ధులు లేవు. ఏదేమైనా శోభ‌న లాంటి టాలెంటెడ్ యాక్ట‌ర్ మోక్ష‌జ్ఞ సినిమా లో న‌టిస్తే ఈ సినిమా పై మ‌హిళా అభిమాను ల‌తో పాటు పాత త‌రం సినీ ప్రేమికుల్లోనూ కాస్తో కూస్తో ప్ల‌స్ అవుతుంది అన‌డంలో ఎలాంటి సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: