కొత్త సినిమాల విషయంలో ఎన్టీఆర్ షాకింగ్ డెసిషన్.. ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇది..!
- వార్ పూర్తయిన వెంటనే సెట్స్ మీదకు ప్రశాంత్ నీల్ సినిమా
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .
టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తాజాగా నటించిన సినిమా దేవర. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ పాన్ ఇండియా సినిమా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్ సినిమాగా నిలిచింది. ఈ సినిమా ఇప్పటికే రు. 520 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి బాక్సాఫీస్ దగ్గర ఇంకా దూసుకుపోతుంది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జోడిగా జాన్వి కపూర్ హీరోయిన్గా నటించింది. ఈ సినిమా కంప్లీట్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కింది. మిక్కిలినేని సుధాకర్ - కొసరాజు హరికృష్ణ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు. దేవర సూపర్ డూపర్ హిట్ అవడంతో కాస్త బ్రేక్ తీసుకున్న ఎన్టీఆర్ దేవర సినిమాకు సీక్వెల్ తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు.
ఇదిలా ఉంటే ఎన్టీఆర్ తన కొత్త సినిమాల విషయంలో షాకింగ్ డెసిషన్ తీసుకోనున్నారు. ఇకపై ఎన్టీఆర్ ఏ మాత్రం బ్రేక్... గ్యాప్ లేకుండా వరుస పెట్టి సినిమాలు చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. బాలీవుడ్ ప్రెస్టీజియస్ స్పై యాక్షన్ థ్రిల్లర్ వార్-2 లో తారక్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో సినిమా చేయనున్నాడు. ఇక నవంబర్ నుంచి ఎన్టీఆర్ ‘వార్-2’ షూటింగ్లో జాయిన్ అవుతున్నాడు.
వార్ 2 సినిమాలో తన పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తి అయిన వెంటనే ప్రశాంత్ నీల్ మూవీలో నటించేందుకు సిద్ధమవుతున్నాడు. ఆ తర్వాత దేవర 2 సినిమా ఉండనే ఉంటుంది. ఇలా ఎలాంటి బ్రేక్ లేకుండా ఎన్టీఆర్ తన నెక్ట్స్ రెండు సినిమాలను పూర్తి చేయాలని చూస్తున్నాడట.