స్టార్ హీరోయిన్ ఫ్లాప్‌ల పరంపర.. ఎంత చూపించినా నో లక్..?

Suma Kallamadi
ఇండియన్ సినిమాల్లో హీరోయిన్ల కెరీర్స్ ఎందుకు హీరోల కంటే తక్కువ కాలం ఉంటాయి అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? సాధారణంగా, హీరోయిన్లు హీరోల కంటే తక్కువ కాలం సినిమాల్లో కనిపిస్తారు. ఒకవేళ హీరోయిన్ చాలా ఫేమస్ అయితే, పది సంవత్సరాల పాటు వరుస సినిమాల్లో నటిస్తారు. కానీ, ఆమెకు అంతగా అవకాశాలు దక్కకపోతే, ప్రేక్షకులు ఆమెను త్వరగా మర్చిపోతారు. ఉదాహరణకి, సమంత, రకుల్ ప్రీత్, పూజా హెగ్డే లాంటి హీరోయిన్లు గతంలో ఎంతో ఫేమస్ అయ్యారు కదా. కానీ, ఇప్పుడు రష్మిక, మీనాక్షి చౌదరి, శ్రీ లీల, నేహా శెట్టి, మృణాల్ ఠాకూర్ లాంటి కొత్త హీరోయిన్లు ఎక్కువ అవకాశాలు అందుకుంటున్నారు. అలాగే, కావ్య థాపర్ అనే కొత్త హీరోయిన్ కూడా ‘ఎక్ మినీ కథ’ సినిమాతో బాగా పాపులర్ అయింది. దాని తర్వాత ఆమెకు ఎన్నో అవకాశాలు వచ్చాయి.
కావ్య థాపర్ ఈ సినిమాతో ఆమె చాలా మందికి పరిచయమై ఆ తర్వాత ఆమెకు వరుసగా సినిమా ఆఫర్లు వచ్చాయి. వరుసగా సినిమాలు కానీ వాటిలో ఒక్కటి కూడా హిట్ కాలేదు ఈ ఏడాది కవ్య నటించిన నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. కానీ, ఈ సినిమాలన్నీ హిట్ అవ్వలేదు. ‘ఈగల్’ సినిమాలో రవితేజ లాంటి స్టార్ హీరోతో కలిసి నటించినా, ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. ‘ఊరు పేరు భైరవకోన’ సినిమాలో కావ్య థాపర్ చాలా గ్లామరస్‌గా కనిపించినా, సినిమా మాత్రం ఫ్లాప్ అయింది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాలో కూడా కావ్య చాలా సెక్సీగా కనిపించి యువతను ఆకట్టుకుంది. అందాలన్నీ ఆరబోసింది కానీ, ఈ సినిమా కూడా హిట్ అవ్వలేదు. హిట్ సినిమా కోసం ఆమె ఇంకా ఎదురు చూస్తోంది. ఆమె తన నటనను మరింత మెరుగుపరుచుకుని, మంచి కథలు ఎంచుకుంటే తప్పకుండా హిట్ కొడుతుంది.
ఈ బ్యూటీ తాజాగా నటించిన సినిమా ‘విశ్వం’ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఈ ముద్దుగుమ్మ చేసిన ప్రతి సినిమాలోనూ ఆమె చాలా అందంగా ఉంటుంది. కానీ, ఆమె నటించిన సినిమాలు హిట్ అవ్వడం లేదు. సినిమాల కథలు బాగా లేకపోతే, ఆ హీరోయిన్ ఎంత అందంగా ఉన్నా ప్రేక్షకులు ఆ సినిమాను చూడరు. ఇందుకు కావ్య నిస్సహాయక స్థితిలో ఉండిపోయింది. వరుసగా సినిమాలు ఫ్లాప్ అవుతుంటే, ఆ హీరోయిన్‌పై నెగిటివ్ ముద్ర పడిపోతుంది. ఈ ముద్దుగుమ్మకు అదృష్టం బాగాలేకపోవడం వల్లే ఇలాంటి చెత్త సినిమాలను వేయించుకుంటుందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: