ఆ హీరోయిన్ ను వదలనంటున్న బోయపాటి.. త్రివిక్రమ్ లా మారిపోయాడే?

praveen
సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్లు కాస్త ఎక్కువే. అందుకే ఇక ఏదైనా కాంబినేషన్లో హిట్ వచ్చిందంటే చాలు ఆ కాంబినేషన్ రిపీట్ చేయాలని ప్రతి ఒక్కరు కూడా ఆశ పడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు వరకు హీరో -దర్శకుడు, హీరో హీరోయిన్ల కాంబినేషన్లు మాత్రమే ఇలా రిపీట్ అవ్వడం చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏకంగా హీరోయిన్ - దర్శకుల కాంబినేషన్ కూడా ఇండస్ట్రీలో రిపీట్ అవుతుంది. ఏకంగా కొంతమంది హీరోయిన్లను తమకు లక్కీ చార్మ్ గా భావిస్తున్న దర్శకులు ఇక వారి ప్రతి సినిమాలో కూడా ఆయా హీరోయిన్లకు ఛాన్సులు ఇస్తూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం.

 మాటల మంత్రికుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న త్రివిక్రమ్ విషయంలో కూడా ఇదే జరిగింది. ముందుగా పవన్ కళ్యాణ్ తో తీసిన అత్తారింటికి దారేది సినిమాలో సమంతకు చాన్స్ ఇచ్చాడు. ఈ సినిమా హిట్ అవ్వడంతో సమంతను సెంటిమెంట్ గా భావించాడు త్రివిక్రమ్. ఆ తర్వాత వచ్చిన సన్నాఫ్ సత్యమూర్తి, అ ఆ సినిమాల్లోనూ తీసుకున్నాడు. ఈ రెండు సినిమాలు కూడా హీట్ అయ్యాయి. ఆ తర్వాత సమంత అటు ఇండస్ట్రీకి కాస్త గ్యాప్ తీసుకోవడంతో త్రివిక్రమ్ కూడా ఆమె కోసం పాత్రలు రాయడం మానేశాడు. కానీ మీరు నేను రాసిన పాత్రలు చేస్తారో చేయరో అని రాయట్లేదు అంటూ ఇటీవల ఒక సినిమా ఈవెంట్ స్టేజి మీద త్రివిక్రమ్ చెప్పేసాడు.

 నేను చేయడానికి రెడీ అంటూ సమంత సైగ చేసేసింది. దీన్ని బట్టి ఇక రాబోయే రోజుల్లో మళ్ళీ సమంత లేని త్రివిక్రమ్ సినిమాను చూడటం కష్టమే అన్నది తెలుస్తుంది. అచ్చంగా బోయపాటికి కూడా ఇలాగే ఒక లక్కీ హీరోయిన్ ఉంది. ఆమె ఎవరో కాదు ప్రగ్యా జైస్వాల్. ఈమెను తెలుగు ఇండస్ట్రీ పట్టించుకోవడం ఎప్పుడో మానేసింది. కానీ అటు బోయపాటి మాత్రం ఇంకా ఈమె వెంటే పడుతున్నాడు. అప్పుడెప్పుడో బోయపాటి జయ జానకి నాయక సినిమాలో ఒక చిన్న పాత్రను ఇచ్చాడు. ఇక తర్వాత ఏకంగా హీరోయిన్ ను చేసి అఖండ సినిమా తీశాడు. ఇక ఇప్పుడు అఖండ-2 లో కూడా అటు హీరోయిన్గా ప్రగ్యాను  తీసుకున్నాడు అన్నది తెలుస్తుంది. దీంతో ప్రగ్య జైస్వాల్ అటు బోయపాటి శ్రీనుకి  లక్కీ హీరోయిన్ గా మారిపోయింది అంటూ అందరూ మాట్లాడుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: