కొన్ని రోజుల క్రితం ఆహా ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో లెవెల్ క్రాస్ అనే సినిమా నేరుగా తెలుగు భాషలో ఓ టి టి ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో ఆసఫ్ అలీ , అమలా పాల్ ప్రధాన పాత్రలలో నటించారు. ఆర్ఫాజ్ అయుబ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా ... రమేష్ పి పిళ్ళై ఈ మూవీ ని నిర్మించారు. విశాల్ చంద్రశేఖర్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. సైకలాజికల్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది ..? ప్రేక్షకులను ఆకట్టుకోగలుగుతుందా ..? లేదా అనే వివరాలను తెలుసుకుందాం.
ఈ సినిమా కథ విషయానికి వస్తే ... ఒక వ్యక్తి రైల్వే స్టేషన్ లెవెల్ క్రాస్ వద్ద పని చేస్తూ ఉంటాడు. ఒక రోజు ట్రైన్ వెళుతున్న సమయంలో ఒక ఆడ మనిషి అందులో నుండి పడిపోతుంది. దానిని అక్కడే పని చేస్తున్న వ్యక్తి చూస్తాడు. చూసిన తర్వాత ఆమె ఎలా ఉందనేది చూసి ఆమెను తానుకుంటున్న ఇంటి వద్దకు తీసుకువెళ్తాడు. ఆ తర్వాత ఆమెకు సుల స్పృహ వస్తుంది. ఆమె స్పృహ వచ్చాక ఇంటికి వెళ్ళిపోతాను అంటుంది. కానీ ఆయన మాత్రం ఇక్కడ దగ్గర ఏమీ ఉండవు మీరు వెళ్లడం కష్టం అవుతుంది ... మీ వాళ్ళు నీ కోసం ఉదయం వరకు వస్తారు అని చెబుతాడు. అయినా వినకుండా ఆమె వెళ్లడానికి ప్రయత్నిస్తుంది.
కానీ అది కుదరదు. ఆ తర్వాత అక్కడే ఉంటున్న వీరిద్దరి మధ్య స్నేహం చిగురుస్తుంది. మరి ఆ తర్వాత ఏమి జరిగింది అనేది ఈ సినిమాలో చూడాల్సి ఉంటుంది. ఇకపోతే సైకలాజికల్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా మొదటి నుండి చివరి వరకు ఎంజాయ్ చేస్తూనే వెళుతుంది. ఇక ఈ సినిమాలో వచ్చే ట్విస్ట్ లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఓవరాల్ గా చెప్పాలి అంటే ఈ సినిమా సైకలాజికల్ థ్రిల్లర్స్ ను ఇష్టపడే ప్రేక్షకులకు అద్భుతంగా నచ్చుతుంది. మామూలు ప్రేక్షకులకు కూడా ఈ సినిమా బాగానే నచ్చే అవకాశాలు ఉన్నాయి.