మసాలా ఘాటు ఎక్కువైంది..సినిమా ట్రాక్ తప్పింది ?
* బోల్ బచ్చన్ సినిమాకు రీమేక్ గా మసాలా
* 30 కోట్లతో గ్రాండ్‌గా సినిమా
టాలీవుడ్ ఇండస్ట్రీలో.. రకరకాల సినిమాలు వస్తున్న సంగతి తెలిసిందే. క్రైమ్, యాక్షన్, హారర్, లవ్ స్టోరీస్ సస్పెన్స్ థ్రిల్లర్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాల సినిమాలు వస్తున్నాయి. అయితే... ఈ మధ్యకాలంలో మల్టీస్టారర్ సినిమాలు కూడా బాగా అయిపోయాయి. స్టార్ హీరోలు సైతం... మల్టీ స్టార్ సినిమాలు చేసి హిట్ అందుకుంటున్నారు. అయితే కొంతమంది బడా హీరోలు మల్టీస్టారర్ చేయడంలో విఫలమవుతున్నారు. అలాంటి వారిలో హీరో దగ్గుబాటి వెంకటేష్, రామ్ పోతినేని ఉన్నారు.
వెంకటేష్ అలాగే రామ్ కాంబినేషన్ లో ఓకే మల్టీస్టారర్ సినిమా వచ్చింది. ఆ సినిమాని మసాలా. 2013 నవంబర్ 14వ తేదీన... ఈ సినిమా ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయింది. ఈ సినిమాకు విజయభాస్కర్ దర్శకత్వం అందించగా మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ ఉన్నారు. ఈ సినిమా సురేష్ ప్రొడక్షన్ లోనే వచ్చింది. దాదాపు 35 కోట్ల బడ్జెట్ పెట్టి... ఈ మల్టీ స్టార్ కామెడీ సినిమా తీశారు.
ఇందులో హీరో వెంకటేష్ అలాగే రామ్ పోతినేని యాక్టింగ్ అదరగొట్టేశారు. ఎవరు ఊహించని విధంగా ఇద్దరు కామెడీ చేసి.. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే ప్రయత్నం చేశారు. అయితే 35 కోట్లతో తీసిన ఈ సినిమా... బాక్సాఫీస్ ముందు పెద్దగా ఆడలేదు. జనాలకు ఈ సినిమా నచ్చలేదు. ఈ సినిమా ఓవరాల్ కలెక్షన్ ఎనిమిది కోట్లు మాత్రమే వచ్చింది. అంటే బిగ్గెస్ట్ డిజాస్టర్ మల్టీస్టారర్ గా ఈ సినిమా మిగిలింది అన్నమాట.
విక్టరీ వెంకటేష్ అలాగే రామ్ పోతినేని యాక్టింగ్ అదరగొట్టినా కూడా... కథ మాత్రం జనాలకు నచ్చలేదు.. ఎవరు ఊహించని ట్విస్టులు... అనవసరమైన పాత్రలు ఎక్కువగా కావడంతో... ఈ సినిమా ఫ్లాప్ అయిందని చెబుతున్నారు. అలాగే ఈ సినిమాలో మ్యూజిక్ కూడా పెద్దగా నచ్చలేదట. ముఖ్యంగా 2012లో బాలీవుడ్ లో వచ్చిన బోల్ బచ్చన్. సినిమాకు రీమేక్ గా దీన్ని తీయడం పెద్ద దెబ్బతీసింది అని చెబుతున్నారు.