తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం మంచి గుర్తింపు కలిగిన నటుడిగా కెరియర్ను కొనసాగిస్తున్న వారిలో రవితేజ ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభంలో కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేశాడు. ఆ తరువాత సినిమాలలో చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ వచ్చాడు. ఆ తర్వాత సినిమాల్లో విలన్ , ముఖ్య , కీలక పాత్రలలో కూడా చాలా సంవత్సరాల పాటు నటించాడు. ఆ తర్వాత ఈయన సినిమాల్లో హీరోగా నటించిన సినిమాలు మంచి విజయాలను సాధించడంతో చాలా తక్కువ కాలంలోనే ఈయన తెలుగు సినీ పరిశ్రమలో మంచి క్రేజ్ ఉన్న హీరోగా మారిపోయాడు. టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి పవన్ కళ్యాణ్ , రవితేజ అద్భుతమైన స్థాయి ఉన్న హీరోగా మారడానికి ఇన్ డైరెక్ట్ గా సహాయ పడ్డాడు.
అది ఎలా అనుకుంటున్నారా .? పవన్ కళ్యాణ్ దగ్గరకు వచ్చిన కొన్ని కథలను ఆయన రిజెక్ట్ చేయడం వల్ల ఆ దర్శకులు ఆ సినిమాలను రవితేజ తో రూపొందించారు. ఆ మూవీలు బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్నాయి. అలా రవితేజ మంచి స్థాయికి చేరుకున్నాడు. పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చేసిన ఏ సినిమాలు రవితేజ దగ్గరకు వెళ్లాయి. ఆ సినిమాలు ఎలాంటి విజయాలను అందుకున్నాయి అనే వివరాలను తెలుసుకుందాం.
ఒక ఇంటర్వ్యూలో భాగంగా పూరి జగన్నాథ్ మాట్లాడుతూ ... పవన్ కళ్యాణ్ గారికి ఇడియట్ , అమ్మానాన్న తమిళ అమ్మాయి పోకిరి సినిమాల కథలను వినిపించినట్లు ఆయన మాత్రం ఆ సినిమాలు చేయలేదు అని చెప్పాడు. ఇక ఈ సినిమాలలో ఇడియట్ , అమ్మానాన్న తమిళ అమ్మాయి సినిమాలలో రవితేజ హీరోగా నటించాడు. ఈ మూవీ బ్లాక్ బాస్టర్ అందుకున్నాయి. ఈ మూవీలు మాత్రమే కాకుండా రాజమౌళి "విక్రమార్కుడు" సినిమా కథను మొదటగా పవన్ కళ్యాణ్ కు వివరించగా ఆయన రిజెక్ట్ చేయడంతో ఆ సినిమా ఆఫర్ రవితేజకు వెళ్లిందట. అలా పవన్ రిజెక్ట్ చేసిన మూడు సినిమాలలో రవితేజ నటించి మూడింటితో కూడా మంచి విజయాలను అందుకున్నట్లు తెలుస్తోంది.