టాలీవుడ్
ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకులలో
గౌతమ్ తిన్ననూరి ఒకరు. ఈయన మళ్ళీరావా అనే సినిమాతో దర్శకుడిగా కెరియర్ను మొదలు పెట్టాడు. ఈ
మూవీ తర్వాత
జెర్సీ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ రెండు సినిమాలు కూడా మంచి విజయాలను అందుకున్నాయి.
జెర్సీ మూవీ ని
హిందీ లో
షాహిద్ కపూర్ హీరో గా
జెర్సీ అనే టైటిల్ తోనే
గౌతమ్ రూపొందించాడు. ఈ
మూవీ మాత్రం బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇకపోతే కొంత కాలం ఈయన
విజయ్ దేవరకొండ హీరోగా ఓ
మూవీ ని చేయనున్నట్లు అనౌన్స్ చేశాడు. ఇక
విజయ్ మాత్రం ది ఫ్యామిలీ స్టార్
మూవీ పై సమయాన్ని కేటాయించడంతో ఆ గ్యాప్ లో
గౌతమ్ మ్యాజిక్ అనే ఒక చిన్న సినిమాను రూపొందించాడు. ఈ
మూవీ కి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించాడు. ఇకపోతే చాలా రోజుల క్రితమే ఈ
సినిమా షూటింగ్ పూర్తి అయినా కూడా ఈ
మూవీ విడుదల తేదీని మాత్రం ఈ
మూవీ బృందం వారు ప్రకటించలేదు.
ఇకపోతే ఈ రోజు ఈ సినిమాకు సంగీతం అందించిన
అనిరుధ్ రవిచంద్రన్ పుట్టిన రోజు సందర్భంగా ఈ
మూవీ బృందం ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ
సినిమా విడుదల తేదీని ప్రకటించింది. ఈ సినిమాను ఈ సంవత్సరం
డిసెంబర్ 21 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ
మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటిస్తూ ఓ
పోస్టర్ ను విడుదల చేశారు. విడుదల చేసిన పోస్టర్లో ఒక
అమ్మాయి , ముగ్గురు అబ్బాయిలు ఉన్నారు. ఈ
పోస్టర్ ను బట్టి చూస్తే ఈ
మూవీ యూత్ ఫుల్ ఎంటర్టైనర్
మూవీ అని అర్థం అవుతుంది. మరి ఈ
సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే. ప్రస్తుతానికి మ్యాజిక్ సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లో మంచి అంచనాలే నెలకొని ఉన్నాయి.