ఎన్టీఆర్ ' అర‌వింద స‌మేత ' గురించి ఈ ఇంట్ర‌స్టింగ్ విష‌యాలు తెలుసా...!

RAMAKRISHNA S.S.
టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా తాజాగా ప్రేక్షకులు ముందుకు వచ్చి బాక్సాఫీస్ దగ్గర వసూళ్లపరంగా దుమ్ము రేపుతుంది. గత నెల 27న థియేటర్లలోకి వచ్చిన దేవర.. తొలుత మిక్స్‌డ్‌ టాక్‌తో బాక్సాఫీస్ దగ్గర జర్నీ మొదలుపెట్టింది. మూడో వారంలోకి ఎంట్రీ ఇచ్చిన దేవర అనూహ్యంగా రూ.510 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇదిలా ఉంటే.. 2018లో త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ సోలోగా నటించిన సినిమా అరవింద సమేత వీర రాఘవ. ఈ సినిమా రిలీజ్ అయ్యి ఆరు సంవత్సరాల పూర్తవుతుంది. అరవింద సమేత వీర రాఘవ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఉన్నాయి.

మాటల మంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ - ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కిన తొలి సినిమా ఇది. అలాగే ఈ సినిమాలో ఎన్టీఆర్‌కి జోడిగా పూజ హెగ్డే హీరోయిన్గా నటించింది. ఈ సినిమా తర్వాత పూజ హెగ్డేను.. త్రివిక్రమ్ మరోసారి కంటిన్యూ చేస్తూ బన్నీ అల వైకుంఠ‌పురంలో సినిమాలో కూడా అవకాశం ఇచ్చారు. ఆ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయింది.  అరవింద సమేత వీర రాఘవ ప్రారంభోత్సవానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రావడం విశేషం. ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ.92 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ ఎమోషనల్ నటన ప్రేక్షకులను కట్టిపడేసింది.

రూ.92 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన అరవింద సమేత.. ఫుల్ రన్‌లో 94 కోట్ల షేర్ రాబట్టి బయ్యర్లకు రెండు కోట్ల రూపాయల లాభాలు అందించి క్లీన్ హిట్ సినిమాగా నిలిచింది. ఈ సినిమా ఆ రోజుల్లోనే నైజాంలో రూ.21 కోట్ల షేర్ రాబట్టగా.. సీడెడ్ లో రూ.16 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. ఈ సినిమా కంప్లీట్ అయిన వెంటనే ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్లో మరో సినిమా పట్టాలెక్కాల్సి ఉంది. త్రిబుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్, త్రివిక్రమ్ రెండో సినిమా కూడా సెట్స్ మీదకు వెళ్లి అనుకొని కారణాలతో ఆగిపోయింది. ఆ వెంటనే త్రివిక్రమ్ - మహేష్ బాబుతో గుంటూరు కారం సినిమా తెరకెక్కించగా.. ఎన్టీఆర్.. కొరటాల శివతో దేవర సినిమాలో నటించారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: