టాలీవుడ్లో హీరోయిన్ సంఘవి మొదటి భర్త ఎవరు... ఎందుకు విడిపోయింది... ?
- రాజశేఖర్ శివయ్య దర్శకుడు సురేష్ వర్మతో ప్రేమాయణం
- సీక్రెట్ పెళ్లి ... అనంతరం విడాకులు
- బెంగళూరు ఐటీ టెక్కీ వెంకటేష్ తో రెండో పెళ్లి ..
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .
సంఘవి ఒకప్పుడు తెలుగు, తమిళ భాషలలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన ముద్దుగుమ్మ. కర్ణాటకలోని మైసూర్లో ఉన్నత కుటుంబంలో జన్మించింది సంఘవి. 1993 లో వచ్చిన కొక్కొరొకో మూవీతో తన సినీ ప్రయాణం ప్రారంభించింది. చాలా తక్కువ టైంలోనే తెలుగు, తమిళ భాషలలో ఎంతో మంది స్టార్ హీరోలు.. దర్శక, నిర్మాత దృష్టిని ఆకర్షించింది. 15 సంవత్సరాల కేలరీలో 80 కి పైగా సినిమాలలో నటించిన సంఘవి.. బుల్లితెరపై కొన్ని పాపులర్ సీరియల్స్‌లో కూడా నటించింది. కెరీర్ పిక్స్ టైంలో ఉన్నప్పుడే సంఘవి, రాజశేఖర్.. శివయ్య సినిమాలో నటించింది. ఆ టైంలోనే ఆ సినిమా దర్శకుడు సురేష్ వర్మతో ప్రేమలో పడింది.
తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా.. సంఘవి 2000 సంవత్సరంలో సురేష్ వర్మను పెళ్లి చేసుకుంది. వీరిద్దరి వైవాహిక జీవితం మొదట్లో బాగానే సాగింది. కొన్నాళ్లకు ఇద్దరు మధ్య విభేదాలు తలెత్తాయి. అవి పెరిగి విడాకులకు దారితీశాయి. సురేష్ వర్మతో ప్రేమలో పడి విడాకులు తీసుకోవడం.. సంఘవి కెరీర్ పై ఎఫెక్ట్ చూపించింది. 2008 తర్వాత ఆమె వెండితెరపై కనుమరుగు అయింది. చాలా యేళ్ళు ఒంటరిగా ఉన్న సంఘవి.. 2016లో ఐటీ ప్రొఫెషనల్ వెంకటేష్‌ని రెండో వివాహం చేస్తుంది. బెంగళూరులో ఓ స్టార్ హోటల్ లో వీరి వివాహం గ్రాండ్‌గా జరిగింది. పెళ్ళైన నాలుగేళ్లకు అంటే 2020లో ఈ దంపతులకు చాన్వి అనే అమ్మాయి జన్మించింది. ప్రస్తుతం సంఘవి బెంగళూరులో ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది.