డిస్కో శాంతితో శ్రీ‌హ‌రి రెండుసార్లు పెళ్లి ఎందుకు జ‌రిగింది.. ఆ స్టోరీ ఇదే..!

RAMAKRISHNA S.S.
:తెలుగు చలనచిత్ర పరిశ్రమలో హీరోగా, విలన్గా, సహాయకు నటుడిగా విలక్షనమైన పాత్రలను పోషించి ఒక వెలుగు వెలిగారు దివంగత రియల్ స్టార్ శ్రీహరి. శ్రీహరి భౌతికంగా మన మధ్య లేకపోయినా.. ప్రేక్షకుల గుండెల్లో మాత్రం సజీవంగా ఉన్నారు. కృష్ణా జిల్లాలో నిరుపేద కుటుంబంలో జన్మించిన శ్రీహరి.. అంచెలంచెలుగా ఎదిగారు. సినిమా రంగంలో తనదైన ముద్రవేశారు. శ్రీహరి వ్యక్తిగ‌త‌ జీవితం విషయానికి వస్తే.. సినీనటుడు సిఎల్ ఆనంద్ కుమార్తె ఐటెం డ్యాన్సర్ అయిన డిస్కో శాంతిని వివాహం చేసుకున్నారు. డిస్కో శాంతి 1983 నుంచి 1997 వరకు గ్లామర్ ఫీల్డ్ లో ఉన్నారు. ఐటెం డ్యాన్సర్గా ఆమె ఒక వెలుగు వెలిగారు.

సపోర్టింగ్ రోల్స్‌తో పాటు.. కామెడీ రోల్స్ కూడా చేశారు. ఏడు భాషల్లో ఆమె 900 కు పైగా సినిమాలలో నటించారు. అయితే డిస్కో శాంతిని.. శ్రీహరి రెండుసార్లు వివాహం చేసుకున్నారు. 1991లో నాగబాబు హీరోగా తెరకెక్కిన దాదల్‌ ఎక్స్‌ప్రెస్ సినిమా షూటింగ్ టైంలో.. శాంతితో శ్రీహరికి పరిచయం ఏర్పడింది. ఆ సినిమాలో శ్రీహరి విలన్ గా చేస్తే.. శాంతి స్పెషల్ సాంగ్లో మెరిశారు. అయితే షూటింగ్ టైంలో శాంతి మంచితనం.. శ్రీహరిని ఎంతోగానో ఆకట్టుకున్నాయి. దాంతో శ్రీహరి ఒకరోజు నేరుగా వెళ్లి పెళ్లి చేసుకుంటానని చెప్పారట. ముందు డిస్కో శాంతి ఎలాంటి సమాధానం ఇవ్వకపోయినా.. కొద్ది రోజులకు శ్రీహరి ప్రేమను అంగీకరించింది.

ఏడాది పాటు ప్రేమించుకున్న శ్రీహరి, డిస్కో శాంతి 1992లో చెన్నైలో ఒక గుడికి వెళ్లారు. అక్కడ ఒక పూజారి వారిద్దరి జాతకాలు చూసి ఈ ఏడాది మీరు పెళ్లి చేసుకోకపోతే జీవితంలో ఒక్కటి కాలేరని చెప్పారట. వెంటనే శ్రీహరి అదే గుడిలో శాంతి మెడలో మూడు ముళ్ళు వేసేశారు. ఈ పెళ్లి గురించి వాళ్లు పెద్దలకు చెప్పలేదు. ఆ తర్వాత డిస్కో శాంతి తన చెల్లెళ్లకు, తమ్ముళ్లకు పెళ్లి చేసి సెటిల్ అవ్వాలని భావించింది. ఇక 1996లో అధికారికంగా రెండోసారి శ్రీహరితో ఏడడుగులు వేసింది. పెళ్లి తర్వాత డిస్కో శాంతి ఇండస్ట్రీకి దూరమైంది. శ్రీహరి, శాంతి దంపతులకు ముగ్గురు సంతానం.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: