సిటాడెల్ : మాస్ ఫైట్స్ తో ర్యాంప్ ఆడించిన సమంత.. ట్రైలర్ అదిరిపోయిందిగా..!!

murali krishna
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మరోసారి బాలీవుడ్ లో హీట్ పెంచేందుకు సిద్దమైంది.. గతంలో వచ్చిన ఫ్యామిలీ మాన్ 2 సిరీస్ లో యాక్షన్ ఎపిసోడ్స్ లో దుమ్ము రేపిన సమంత మరోసారి బాలీవుడ్ ప్రేక్షకులకు తన యాక్షన్ పరిచయం చేసేందుకు సిద్దమైంది..రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో తెరకెక్కిన సిటాడెల్ వెబ్ సిరీస్ కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా వస్తోన్న ఈ సిరీస్‌లో క్యూట్ బ్యూటీ సమంత అలాగే బాలీవుడ్ యంగ్ యాక్టర్ వరుణ్ ధావన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఇప్పటికే దీనికి సంబంధించిన టీజర్ విడుదలై  ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకుంది. తాజాగా నేడు సిటాడెల్ హనీ బన్నీ నుంచి ట్రైలర్ రిలీజ్ అవ్వనుంది అని సామ్ నిన్న సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. కాగా ఈ మేరకు మేకర్స్ తాజాగా ట్రైలర్ విడుదల చేశారు.ట్రైలర్ మొత్తం ఫుల్ యాక్షన్‌తో సమంత దుమ్ము రేపింది.. 

సిటాడెల్ ట్రైలర్ ప్రేక్షకుల అంచనాలను రీచ్ అయ్యింది. స్టార్ నటి సమంత గన్స్ పట్టుకుని యాక్టింగ్ చించి పడేసింది... ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది..ఇక సామ్ ఫ్యాన్స్ అయితే కామెంట్లతో సోషల్ మీడియాలో హంగామా స్టార్ట్ చేశారు. సిటాడెల్ నవంబర్ 7 వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది.తెలుగుతో పాటు ఈ సిరీస్ మరికొన్ని భాషల్లో కూడా ప్రేక్షకులని అలరించనుంది. ఇక సమంత పెర్ఫార్మన్స్ కి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.. మొన్నటివరకు మాయోసైటీస్ వ్యాధితో సినిమాలకు దూరంగా వున్న సమంత తాజాగా అదిరిపోయే యాక్షన్ ట్రీట్ ఇస్తుందటంతో ప్రేక్షకులు ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి..ప్రస్తుతం సమంత తన ఓన్ ప్రొడక్షన్ లో ఓ సినిమా చేసేందుకు సిద్ధం అయింది.. ఆ సినిమా వివరాలు త్వరలోనే వెల్లడించబోతుంది.. అలాగే టాలీవుడ్ లో ఎన్టీఆర్ సినిమాలో సమంత ఐటమ్ సాంగ్ చేయనుందనే న్యూస్ తెగ వైరల్ అవుతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: