టాలీవుడ్ : హీరో గారు రు. 50 కోట్లు తీసుకున్న సినిమాకు అందులో సగం కలెక్షన్లు లేవ్..?
టాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాల పరిస్థితి ఎలా ఉంది అని చెప్పేందుకు ఒక స్టార్ హీరో సినిమాలే పెద్ద ఉదాహరణగా చెప్పుకోవాలి ఆయనను స్టార్ హీరో ఆయన పేరు పవర్ చెబితే అందరూ ఊగిపోవాలి కానీ గత పది-12 సంవత్సరాల లో ఆయన నటించిన సినిమాల లో ఒక్క సినిమా మాత్రమే సూపర్ డూపర్ హిట్ అయింది .. ఆ సినిమాకు మాత్రమే కాస్త కూసో చెప్పుకో దగ్గ లాభాలు వచ్చాయి . ఆ హీరో నటించిన మిగిలిన అన్ని సినిమాలు డిజాస్టర్లు అయ్యాయి. ఒకటి రెండు సినిమాలు కు హిట్ టాక్ వచ్చిన కూడా అనుకున్న స్థాయిలో వసూళ్లు రాలేదు.
కానీ ఆయన గారి రెమ్యునరేషన్ చూస్తే మాత్రం 50 నుంచి 55 కోట్ల స్థాయిలో ఉంటుంది . అది కూడా చాలా తక్కువ రోజులు మాత్రమే కాల్ షీట్లు ఇస్తారు కొన్ని సినిమాల కు అయితే ఆ హీరో గారు రెమ్యూనరేషన్ 50 నుంచి 55 కోట్లు తీసుకుంటే కనీసం అందులో సగం కూడా కలెక్షన్లు లేవు అంటే నమ్మాల్సిందే .ఒక స్టార్ హీరో 50 నుంచి 55 కోట్ల రేషియోలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు అంటే ఆ హీరో గారి సినిమాల వసూళ్లు ఏ స్థాయిలో ఉండాలి 200 కోట్లకు పైనే ఉండాలి.
అసలు హీరో రెమ్యూనరేషన్ లోనే సగం కూడా వసూళ్లు లేవు అంటే ఇక నిర్మాత ఏమైపోవాలి ఆ సినిమాకు ఉన్న వాళ్ళు ఎలా బలైపోవాలి వాళ్లకు ఎన్ని హిట్ సినిమాలు వస్తే పోగొట్టుకున్న డబ్బులు రావాలి అన్నది వాళ్లే ఆలోచించుకోవాలి స్టార్ హీరో స్టార్ కాంబినేషన్ అన్న మాయలో పడి కోట్లకు కోట్లు పోగొట్టుకుని ఆ తర్వాత లబోదింపమంటున్నారు నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు బయ్యర్లు ఈ పరిస్థితుల్లో మార్పు రాకపోతే టాలీవుడ్ లో చాలా మంది మాట్టు మయం అయ్యే ప్రమాదం కూడా ఉంది .