అల్లూరి సీతారామరాజు సినిమా సూపర్‌స్టార్ కృష్ణ కెరీర్‌ను అంత దెబ్బ కొట్టిందా...!
వీటిలో రాధమ్మ పెళ్లి - దీర్ఘసుమంగళి' మంచి సినిమాలు అని కృష్ణ అనుకున్నా.. అవి హిట్ కాలేదు. ఇక దేవదాసు సినిమాపై కృష్ణ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆ సినిమా కూడా పెద్ద డిజాస్టర్. దేవదాసు కూడా పోవటంతో కృష్ణ కొంచెం బాధ పడ్డారు. 1974 సంవత్సరంలో ఈ సినిమాలన్నీ ఫ్లాప్ అయితే .. 1975 వ సంవత్సరంలో కూడా కృష్ణ ఫ్లాప్ ల పరంపర కంటిన్యూ అయింది. అభిమానవతి - కొత్తకాపురం - సౌభాగ్యవతి - చీకటివెలుగులు - రక్త సంబంధాలు - సంతానం సౌభాగ్యం - గాజుల కిష్టయ్య - దేవుడులాంటి మనిషి సినిమాలన్నీ 1975 లో విడుదలయితే అవన్నీ బిజనెస్ రేంజ్ సక్సెస్ గానే మిగిలాయి.
ఆ తర్వాత కృష్ణతో సినిమాలు చేసేందుకు ఎవ్వరూ ముందుకు రాని పరిస్థితి. అప్పటి వరకు రోజుకి మూడు షిఫ్ట్ లు చేసిన కృష్ణతో ఒక్క సినిమా కూడా చెయ్యడానికి ఒక్క నిర్మాత కూడా ముందుకు రాలేదంటే షాకే కదా.. ఈ విషయం స్వయంగా కృష్ణగారే చెప్పుకున్నారు. అలాంటి టైంలో కృష్ణ తన సొంత బ్యానర్ లో సినిమా తీసి మళ్ళీ తానేంటో నిరూపించుకోవాలని అనుకున్నారు. దర్శకుడు పి సి రెడ్డి గారు చెప్పిన కథ నచ్చటంతో దాని మీద వర్క్ చెయ్యాలనుకున్నారు. అలా పాడి పంటలు సినిమాతో కృష్ణ పూర్వ వైభవం మళ్ళీ వచ్చింది.