టాలీవుడ్ : డ‌బ్బెక్కువున్న నిర్మాత‌లున్నంత కాలం హీరోల‌కు హిట్టొద్దు.. డ‌బ్బే ముద్దు..?

Divya
•ఎన్నారైలు నిర్మాతలుగా మారడం వల్లే అసలు చిక్కంతా..
•నిర్మాతల మధ్య పోటీ.. కొండెక్కి కూర్చుంటున్న హీరోలు..
•ఇండస్ట్రీని నమ్ముకున్న నిర్మాతలకు మిగిలింది బూడిదేనా..

టాలీవుడ్ లో ఒకప్పుడు కేవలం సినిమా మీద ఫ్యాషన్ తో సినిమాలు తీసే నిర్మాతలు ఎక్కువగా ఉండేవారు.  అయితే ఇప్పుడు కాలం మారింది. రియల్ ఎస్టేట్ తో పాటు ఇతర వ్యాపారాలలో భారీగా సంపాదించి కోట్లు కూడబెట్టినవారు సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చి నిర్మాతలుగా మారుతున్నారు. దీనికి తోడు అమెరికా వంటి ఇతర దేశాల్లో ఫార్మా కంపెనీ తో పాటు  సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టి చాలా తక్కువ టైంలోనే కోట్ల రూపాయలు సంపాదించిన వారు టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోలతో సినిమాలు తీస్తే తమ పేరు ప్రఖ్యాతలు పెరిగిపోతాయి అన్న ఆశలతో ఈ రంగంలోకి ఎంట్రీ ఇస్తున్నారు.

కానీ వాస్తవంగా ఇక్కడికి వచ్చి ఒకటి రెండు సినిమాలు తీశాకే కానీ వారికి పరిస్థితులు అర్థం కావడం లేదు. ఎప్పుడైతే స్టార్ హీరోలతో సినిమా తీయాలని నిర్మాతల మధ్య పోటీ పెరుగుతుందో హీరోలు కొండెక్కి కూర్చుంటున్నారు. ఇష్టం వచ్చినట్టు రెమ్యూనరేషన్ పెంచుకుంటూ పోతున్నారు. ఇప్పుడు స్టార్ హీరోలు ఒక్కో సినిమాకు రూ.60 నుంచి రూ .70 కోట్ల రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.  మామూలుగా సినిమాలనే నమ్ముకుని.. చాలా ఏళ్ళపాటు ఇండస్ట్రీలో ఉంటున్న నిర్మాతలు ఇన్ని కోట్లు ఇచ్చి సినిమాలు తీయలేరు.

ఎప్పుడైతే ఇతర వ్యాపారాలలో రాణించిన నిర్మాతలు ఇక్కడకు వచ్చి ఎలాగైనా హీరో కాల్ సీట్లు సంపాదించాలన్న ఆశతో ఎక్కువ రెమ్యూనరేషన్ ఆఫర్ చేస్తున్నారు.  హీరోలు కూడా కేవలం డబ్బు కోసమే ప్రాధాన్యత ఇస్తున్న పరిస్థితిఏర్పడింది.  సినిమా ఎలా ఉన్నా సినిమా కొన్న వాళ్ళు ఎలా పోయినా మాకు ఇబ్బంది లేదు.. డబ్బే మాకు ముద్దు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఏది ఏమైనా ఇతర రంగాలకు చెందిన వారు ఇక్కడ సినిమాలు తీస్తుండడం వల్లే నిర్మాతలు కూడా క్వాలిటీ తో సంబంధం లేదు క్వాంటిటీ ఉంటే చాలు అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: