నారా రోహిత్ నిశ్చితార్థం.. ఎన్టీఆర్‌ను దూరం పెట్టారా ? లేక దూరం జరిగారా ? ఆసలు ఏం జరుగుతుంది..!
అయినా సరే ఎన్టీఆర్‌ను అటు నందమూరి కుటుంబం గానీ ఇటు నారా కుటుంబం గానీ ఎవరూ కూడా తమ కుటుంబాలలో జరిగే ఎలాంటి ఫంక్షన్లకు ఆహ్వానించకపోవడం అభిమానులో నిరాశను కలిగిస్తుంది. అయితే ఈ రెండు కుటుంబాలు ఎన్టీఆర్‌ను దూరం పెట్టాయా? ఎన్టీఆర్ ఈ రెండు కుటుంబాలకు దూరంగా ఉంటున్నారా? అన్న విషయాలు ఇంకా తెలియదు కానీ ఎప్పటికప్పుడు ఎన్టీఆర్ ఒకవైపు, నారా - నందమూరి కుటుంబాలు మరోవైపు అన్నట్టుగానే వాతావరణం కనిపిస్తుంది.
అయితే ఇప్పుడు నారా వారి అబ్బాయి నారా రోహిత్ ఎంగేజ్మెంట్ హైదరాబాదులో ఎంతో ఘనంగా కుటుంబ సభ్యుల మధ్య జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ ఎంగేజ్మెంట్ కార్యక్రమంలో జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడ కనిపించలేదు. మరి ఎన్టీఆర్ ను ఎంగేజ్మెంట్ కి ఆహ్వానించలేదా? లేక ఆహ్వానించిన ఆయన ఈ కార్యక్రమానికి రాలేదా? అన్న విషయాలు తెలియాల్సి ఉంది. ఇక నారా రోహిత్ హీరోగా బిజీగా ఉన్న విషయం తెలిసిందే రాజకీయాల్లో చూరుగా లేనప్పటికీ ఎప్పుడూ కూడా తన పెదనాన్న సీఎం నారా చంద్రబాబునాయుడు కుటుంబానికి మద్దతునిస్తూ ఉంటాడు. ఇక ఈ క్రమంలోనే ఎన్టీఆర్ ను ఆహ్వానించలేదని వార్తలు కూడా వస్తున్నాయి . ఇక ఇందు లో ఎంత నిజముందో తెలియదు కానీ ఎన్టీఆర్ మాత్రం నారా రోహిత్ నిశ్చితార్థం వేడుకల్లో కనిపించక పోయేసరికి కొత్త అనుమానాలు వస్తున్నాయి. ఇక మరి నారా వారి పెళ్లి లో అయినా ఎన్టీఆర్ కనిపిస్తాడో లేదో చూడాలి.