ప్రభాస్ కాకుండా ఇండస్ట్రీలో ది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అతడే..మరో సల్మాన్ ఖాన్ లా తయారు అయ్యాడు ఏంట్రా వీడు..!
పెళ్లి చేసుకొను అనడం లేదు . చేసుకుంటాను అని చెప్తున్నాడు . కానీ ఎప్పుడు చేసుకుంటాడు అనేది మాత్రం చెప్పడం లేదు . రీసెంట్గా ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి కనకదుర్గమ్మ గుడిలో ప్రభాస్ పెళ్లి పై స్పందించిన విషయం మనందరికీ తెలిసిందే . కాగా సినిమా ఇండస్ట్రీలో ప్రభాస్ కాకుండా మరొక హీరో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా పిలిపించుకుంటున్నాడు. ఆయనే రామ్ పోతినేని . ఎస్ ఇండస్ట్రీలో ఎనర్జటిక్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన ముద్ర వేయించుకున్న ఈ హీరో ఎంత అందగాడొ మనకు తెలుసు.
పలు సినిమాలతో హిట్స్ అందుకుని తనదైన స్టైల్ లో దూసుకుపోతున్న రామ్ పోతినేని కి కూడా పెళ్లి వయసు దాటిపోతుంది . అయినా సరే పెళ్లి చేసుకోవడం లేదు. దానికి కారణం ఆయన లవ్ ఫెయిల్యూర్ అంటూ వార్తలు వినిపించాయి. ప్రభాస్ అయినా పెళ్లి గురించి స్పందిస్తూ రెస్పాండ్ అవుతున్నాడు కానీ , రామ్ పోతినేని మాత్రం అస్సలు స్పందించడం లేదు. అసలు ఈయన పెళ్లి చేసుకుంటాడా ..? చేసుకోకుండా బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ ఎలా ఏకాకిగా మిగిలిపోయాడో.. అలాగే టాలీవుడ్ కి మరో సల్మాన్ ఖాన్ లా రామ్ పోతినేని మారిపోతున్నాడా..? అంటూ ఫ్యాన్స్ తమకు తామే క్వశ్చన్స్ చేసుకుంటున్నారు..!!