దేవర: ఆ సాంగ్ షూటింగ్ టైంలో 'జెల్లీ ఫిష్' లకు జంకిన జాన్వీ..!

FARMANULLA SHAIK
ఇటీవల కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా వచ్చిన దేవర సినిమా మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. దేవర' సినిమాతో సక్సెస్ ఫుల్ గా టాలీవుడ్ లో అడుగుపెట్టింది బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్. జూనియర్ ఎన్టీఆర్ కు జోడీగా, తంగం అనే పల్లెటూరి అమ్మాయి పాత్రలో విశేషంగా ఆకట్టుకుంది. స్క్రీన్ స్పేస్ తక్కువే ఉన్నప్పటికీ, ఆమె అందానికి ఆడియన్స్ ఫిదా అయ్యారు. తారక్ తో ఆమె పంచుకున్న కెమిస్ట్రీకి మంచి మార్కులు పడ్డాయి. ప్రస్తుతం ఈ మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న జాన్వీ.. తాజాగా 'చుట్టమల్లే' పాటకు సంబంధించిన బీటీఎస్‌ వీడియోలు, ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.ఇప్పటికే ఈ సినిమా 460 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఈ సినిమా అంతా సముద్రం ఒడ్డున జరిగిన కథ కావడంతో షూటింగ్ లో చాలా భాగం సముద్రం ఒడ్డు ఉన్న లొకేషన్స్ లోనే తీశారు.తాజాగా జాన్వీ కపూర్ దేవర షూటింగ్ సమయంలో తీసిన కొన్ని వర్కింగ్ వీడియోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. దేవర సినిమాలో చుట్టమల్లే సాంగ్ థాయిలాండ్ కి వెళ్లి అక్కడ షూట్ చేసారు. జాన్వీ ఈ పాటకు సంబంధించిన వీడియోలు పోస్ట్ చేసింది.
జాన్వీ ఈ వీడియోలలో సముద్రపు ఒడ్డున నిల్చొని.. ఈ వీడియో నేను పోస్ట్ చేయొచ్చేమో. జెల్లీ ఫిష్ ఉన్న నీళ్ళలోకి వెళ్తున్నాను. మాములు సన్నని చీర మాత్రమే నన్ను ప్రొటెక్ట్ చేస్తుంది. నేను బతుకుతాను అనే అనుకుంటున్నాను. నాకు గుర్తుండిపోయే షాట్ అవ్వొచ్చు. ఈ ప్లేస్ చాలా బాగుంది అంటూ సరదాగా మాట్లాడింది. అలాగే సముద్రంలో షూటింగ్ చేస్తుండగా తీసిన వీడియోలు కూడా పోస్ట్ చేసింది. ఇక ఈ వీడియోలు చూస్తుంటే చుట్టమల్లే సాంగ్ థాయిలాండ్ లోని కో పాక్ బియా అనే ఐస్ లాండ్ లో షూట్ చేసినట్టు తెలుస్తుంది.ఈ నేపథ్యంలోనే దేవర పార్ట్-1లో 'చుట్టమల్లే' పాట ఎంత పెద్ద హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రిలీజ్ కు ముందు ఇంటర్నెట్ లో ట్రెండ్ క్రియేట్ చేసిన ఈ రొమాంటిక్ మెలోడీ.. రిలీజ్ తర్వాత థియేటర్లను షేక్ చేసింది. సినిమాలో ఈ సాంగ్ వచ్చినప్పుడు థియేటర్లన్నీ ఆహ్ సౌండ్ తో మారుమ్రోగిపోయాయి. అయితే ఈ పాట షూటింగ్ ఎలా జరిగిందనే వివరాలు తెలియజేస్తూ, జాన్వీ కపూర్ తన ఇన్స్టాగ్రామ్ లో బీటీఎస్‌ (బిహైండ్‌ ది సీన్స్‌) వీడియోను పంచుకుంది. ఇవి నెట్టింట వైరల్ గా మారాయి.ఇకపోతే 'చుట్టమల్లే' సాంగ్ లో ఎన్టీఆర్, జాన్వీ కపూర్ మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఇద్దరి డాన్స్‌ మూవ్స్ తో పాటు విజువల్స్‌ కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. దీనికి రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ బ్యూటిఫుల్ మెలోడీ ట్యూన్ ను కంపోజ్ చేయగా.. రామజోగయ్య శాస్త్రి మంచి సాహిత్యం రాశారు. సింగర్ శిల్పా రావు వాయిస్ ఈ పాటకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: