దసరా సినిమాలను కొల్కోకుండా చేస్తున్న దేవర.. అసలు వారి పరిస్థితి ఏంటి..?

MADDIBOINA AJAY KUMAR
టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమై న గుర్తింపు కలిగిన హీరోల లో ఒకరు అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ తాజాగా దేవర అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే . మొత్తం రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ సినిమా యొక్క మొదటి భాగాన్ని ఈ సంవత్సరం సెప్టెంబర్ 27 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో భారీ ఎత్తున విడుదల చేశారు. ఇకపోతే ఈ సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చిన కూడా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయి రేంజ్ కలెక్షన్లను వసూలు చేస్తుంది.

ఇప్పటికే ఈ మూవీ విడుదల అయ్యి చాలా కాలం అవుతున్న ఈ సినిమా స్టడీగా కలెక్షన్లను రాబడుతుంది. దసరా సీజన్ కు సంబంధించిన సినిమాలు కూడా తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర విడుదల అవుతూ వస్తున్నాయి. నిన్న తమిళ నటుడు అయినటువంటి సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా రూపొందిన సినిమా విడుదల కాగా , ఈ రోజు టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి మ్యాచో స్టార్ గోపీచంద్ హీరో గా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన విశ్వం సినిమా విడుదల అయింది.

అలాగే సుధీర్ బాబు హీరో గా రూపొందిన మా నాన్న సూపర్ హీరో సినిమా కూడా ఈ రోజే విడుదల అయింది. ఇక రేపు సుహాష్ హీరోగా రూపొందిన జనక అయితే ఘనత అనే మూవీ కూడా విడుదల కానుంది. ఇలా ఎన్ని సినిమాలు విడుదల అయినా కూడా దేవర సినిమానే ఎక్కువ థియేటర్లో ప్రదర్శించబడుతుంది. దసరా సినిమాల కంటే ఎక్కువ కలెక్షన్లను ఈ సినిమానే బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టే అవకాశాలు కనబడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: