ఉదయ్ కిరణ్ భార్య.. విషిత ఇప్పుడు ఎక్కడ ఉంది ఏం చేస్తుందో తెలుసా..?

Amruth kumar
చిత్ర పరిశ్రమలో ఎవరి పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరు చెప్పలేరు. ఎంత పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన అప్పటికీ ఎంతో కొంత అదృష్టం లేకపోతే ఇక్కడ కొనసాగడం చాలా కష్టమనే చెప్పాలి. కొందరును చూస్తేనే ఇట్టే అర్థమవుతుంది .. అలాగే మరికొందరికి ఇండస్ట్రీలోకి వచ్చిన వెంటనే ఒక్క సినిమాతోనే  స్టార్‌డ‌మ్‌ తెచ్చుకుంటారు. ఇలా వచ్చిన అవకాశాన్ని కొందరు వినియోగించుకుంటే మరి కొందరు మాత్రం స్టార్‌డ‌మ్‌ వచ్చిందని అహంతో కొన్ని రోజులకే కనుమరుగైపోతారు. మరి కొంతమంది ఎన్ని ప్లాప్‌లు వచ్చినా అలానే ఇండస్ట్రీలో కొనసాగుతారు.

ఇలానే చిత్ర పరిశ్రమలో ఉన్న నటుల పరిస్థితి ఉంటుంది. ఇదే క్రమంలో టాలీవుడ్ లో ఒకప్పుడు ఓ వెలుగు వెలుగున ఉదయ్ కిరణ్ అతి తక్కువ సమయంలోనే కనుమరుగైపోయాడు. అలానే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు. అలాంటి ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకుని తన భార్యను దిక్కులేని దాన్ని చేసి మరణించాడు. ఇక అత‌ని భార్య విషిత ఇప్పుడు ఎక్కడ ఉంది.. ఏం చేస్తుంది.. అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం. టాలీవుడ్ లోనే లవర్ బాయ్గా పేరు తెచ్చుకున్న ఉదయ్ కిరణ్ ఆ తర్వాత సినిమాల కథలు విషయంలో పొరపాట్ల వల్ల వరుస అపజయాలు ఎదుర్కొన్నాడు. అలానే ఇబ్బందులు భరించలేక తన రూమ్ లోనే ఉరి వేసుకుని చనిపోయాడు. పెళ్లి జరిగిన తర్వాతే ఉదయ్ కిరణ్ ఇలా చేసుకోవటంతో ఇప్పటికీ కూడా అతని మరణం ఒక అంతు చిక్కని ప్రశ్నగా మిగిలింది.

అయితే గతంలో ఉదయ్ కిరణ్ భార్య సాఫ్ట్వేర్ జాబ్ చేసేది. తనకు వచ్చిన డబ్బులతో ఉదయ్ కిరణ్ డిప్రెషన్ నుంచి కోలుకోవాలని ఎందరో డాక్టర్లను కూడా కలిసింది. అయినప్పటికీ ఫలితం దక్కలేదు .. అంతటి స్టార్‌డం తెచ్చుకున్న ఉదయ్ కిరణ్ చనిపోయి ఇన్ని సంవత్సరాలు అవుతున్న ఇప్పటికీ చాలా మంది అభిమానుల గుండెల్లో నిలిచిపోయాడు. అలా ఉదయ్ కిరణ్ మరణం తర్వాత ఆయన భార్య విషిత చాలా ఇబ్బందులు ఎదుర్కొండి. ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ.. దాని ద్వారా వచ్చిన డబ్బులను అనాధలకు వృద్ధాశ్రమాలకు ఇస్తూ తన కాలం వెలదీస్తుంది. ఉదయ్‌ను మర్చిపోలేక పెళ్లి కూడా చేసుకోకుండా ఒంటరిగా ఉండిపోయింది విషిత.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: