అయ్యయ్యో..లావణ్య త్రిపాఠి చేసిన చిన్న తప్పు.. ఆ స్టార్ కపుల్ విడిపోయేలా చేసిందే..!
ఆ తర్వాత వీళ్ళ మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకున్నారు. అంతే కాదు నాగచైతన్య త్వరలోనే శోభిత ధూళిపాళ్లతో పెళ్లి పీటలు కూడా ఎక్కబోతున్నాడు . ప్రెసెంట్ సమంత - నాగచైతన్య విడాకులు మేటర్ ఎంత హైలైట్ గా మారిందో అందరికీ తెలిసిందే. ఇలాంటి మూమెంట్లోనే మరొక వార్త సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది . హీరోయిన్ లావణ్య త్రిపాఠి చేసిన చిన్న తప్పు కారణంగానే సమంత - నాగచైతన్య విడిపోయారు అంటూ సరికొత్త వార్త హల్ చల్ చేస్తుంది .
నిజానికి సమంత - నాగచైతన్య మధ్య ప్రేమ పుట్టడానికి కారణం "ఏం మాయ చేసావే" సినిమానే. అయితే గౌతమ్ మీనన్ ఈ సినిమాలో మొదటగా సమంత కంటే ముందే చాలా మంది అమ్మాయిలను హీరోయిన్ గా పెట్టాలి అని ట్రై చేశారట . వాళ్లలో లావణ్య త్రిపాఠి కూడా ఒకరు. లావణ్య త్రిపాఠిని సైతం "ఏం మాయ చేసావే" సినిమా ద్వారా ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేయాలని భావించారట . లావణ్య త్రిపాఠి అప్పుడు ఆ ఆఫర్ ని సున్నితంగా రిజెక్ట్ చేసింది . దానికి కారణం లిప్ లాక్ సీన్స్. మొదటి నుంచి అలాంటి సీన్స్ లో నటించడానికి లావణ్య త్రిపాఠి ఇష్టపడదు . ఒకవేళ లావణ్య త్రిపాఠి అందుకు ఒప్పుకొని "ఏం మాయ చేసావే "సినిమా చేసుంటే.. అసలు నాగచైతన్య - సమంత కలిసే వారే కాదు . వాళ్ళ మధ్య ప్రేమ పుట్టుండేదే కాదు. పెళ్లి - విడాకుల వరకు వచ్చి ఉండేదే కాదు . లావణ్య చేసిన చిన్న తప్పు సమంత - నాగచైతన్య విడిపోవడానికి పెద్ద కారణమైంది అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు..!!