అయ్యబాబోయ్..మెగాస్టార్ చెప్పేది నిజమేనా.?

FARMANULLA SHAIK
మెగాస్టార్ చిరంజీవి అంటే టాలీవుడ్ 45 ఏళ్లుగా కొనసాగుతున్న తిరుగులేని కెరీర్ గుర్తుకు వస్తుంది. చిరంజీవి అంటే నటన, ఫైట్స్ తో పాటు ఆయన చేసిన డ్యాన్సులు కూడా గుర్తుకు వస్తాయి. రీసెంట్ గా చిరంజీవి తన డ్యాన్సులకి గాను గిన్నిస్ వరల్డ్ రికార్డుని కూడా అందుకున్నారు. 1979లో చిరంజీవి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. తన ప్రతిభతో ఇండస్ట్రీలో మెగాస్టార్ గా ఎదిగారు. చిరంజీవి తర్వాత కొంతమంది స్టార్ హీరోలు వచ్చారు కానీ.. ఆయన రేంజ్ ని అందుకోలేకపోయారు. ఇదిలావుండగా చిరంజీవి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ఎన్నో అవమానాలు తర్వాత స్టార్ హీరో రేంజ్‌కు ఎదిగాడు. తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా సామ్రాజ్యాన్ని స్థాపించి తనదైన ముద్ర వేసుకున్నాడు.లక్షలాదిమంది అభిమానాన్ని సొంతం చేసుకుని ఇప్పటికి టాలీవుడ్ నెంబర్ వన్‌ హీరోగా రాణిస్తున్నాడు. వృత్తిపరంగా.. నటుడుగా, డాన్సర్ గానే కాదు.. రియల్ లైఫ్ లోను గొప్ప వ్యక్తిత్వం, సేవ గుణంతో ఇంతలా ఎదిగిన చిరు కెరీర్‌లో ఓ మంచు తునక.. ఆయన నేలపై పడుకోవడం. కోట్ల ఆస్తులుండి.. లగ్జరీ లైఫ్ ఉన్న చిరంజీవి నెల పై పడుకుంటాడా అని ఆశ్చర్యపోతున్నారా.. కానీ అది నిజం. చిరు సినిమా ఈవెంట్‌లో, సక్సెస్ సెలబ్రేషన్స్ అయిపోయినా తర్వాత ఇంటికి వెళ్లి నేలపైనే పడుకుంటాడట. దానికి కారణం సినిమా ఏవెంట్లో చిరున సినీ ప్రముఖులు ఆహా,వోహా అన్ని పొగుడుతుంటారు.
 ఆకాశానికి ఎత్తేసి ఆయన మించిన హీరో లేరన్నట్లు చెబుతారు. రియల్ హీరోని చేసేస్తారు. అదే స్థాయిలో అభిమానుల ప్రేమ, ఆదరణ చూపిస్తారు. ఇంతలా ఆదరిస్తూ మమ్మల్ని ప్రేమిస్తున్నారు అంటే మా కంటే గొప్ప వాళ్ళు లేరని తమ భావిస్తుంటామని.. నిజంగా హీరోల ఫీల్ అవుతామని.. కాసేపు మమ్మల్ని మేము మర్చిపోతం అంటూ చెప్పుకొచ్చాడు. అయితే అభిమానం ప్రేమని ఎప్పుడు తలకెక్కించుకొని ప్రవర్తించను.. అందుకే సినిమా ఈవెంట్లు పూర్తయిన తర్వాత ఇంటికెళ్లి నేలపై పడుకుంటానని.. నేలపైనే నిద్రపోతానని.. నన్ను ఇంతలా ఆదరిస్తున్నారంటే ఆ గొప్పతనం నాది కాదు.. ఆడియన్స్‌ది అంటూ చెప్పుకొచ్చారు. మీరు చూపించే ప్రేమ, అభిమానం ఎప్పుడూ గుండెల్లో దాచుకుంటానని.. అంతేకానీ ఎప్పుడు తలకెక్కించుకోలేదని చిరు వెల్లడించారు.
గతంలో చిరంజీవి నటించిన ఇంద్ర మూవీ ఈవెంట్ లో ఈ విషయాన్ని ఆయన షేర్ చేసుకున్నాడు. ఇటీవల ఇంద్ర రీ రిలీజ్‌ జరిగిన సందర్భంగా ఇంద్ర ఆడియో ఈవెంట్‌ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ వీడియో తెగ వైరల్ గా మారింది. ఇక ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర లో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఇప్ప‌టికే సినిమా కోసం ఏకంగా 13 భారీ సెట్‌లతో ఓ ప్రత్యేక ప్రపంచాన్ని సృష్టించిన విష‌యం తెలిసిందే. ఈ సినిమాలో చిరంజీవి హనుమాన్ భక్తుడిగా కనిపించబోతున్నాడు. త్రిష ,ఆషికా రంగనాథ్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో కనిపింబోతున్నారు. ఈ సినిమాలో ఐదుగురు హీరోయిన్లు ఉన్నట్టుగా టాక్. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ విక్రమ్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి ఆర్‌ఆర్‌ఆర్‌ ఫేం లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌, సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో ఆరు పాటలుంటాయని ఎంఎం కీరవాణి ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: