4000 రూపాయలు పెట్టుబడి.. 50 కోట్ల సంపాదన.. జాక్పాట్ కొట్టిన నాగ చైతన్య..!!

murali krishna
టాలీవుడ్ లో అక్కినేని కుటుంబానికి మంచి బ్రాండ్ వుంది.. తెలుగు సినీ ఇండస్ట్రీ లో అక్కినేని నాగేశ్వరావు నటుడుగా ఓ వెలుగు వెలిగారు.. ఆయన వారసుడుగా ఇండస్ట్రీ లో హీరోగా అడుగు పెట్టిన నాగార్జున సైతం స్టార్ హీరోగా ఎదిగారు ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించారు.. నాగార్జున వారసుడిగా అక్కినేని నాగ చైతన్య జోష్ సినిమాతో సినీ ఇండస్ట్రీకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు.. ఆ సినిమా అంతగా ఆకట్టుకోకపోయిన నాగ చైతన్య ను గ్రాండ్ గా పరిచయం చేసింది.. నాగ చైతన్య ఏమాయ చేసావే సినిమాతో తన కెరీర్ లో తొలి సూపర్ హిట్ అందుకున్నారు.. ఆ సినిమాతో మొదలైన నాగ చైతన్య సక్సెస్ జర్నీ ఇప్పటికీ సాఫిగా సాగుతుంది.. ప్రస్తుతం నాగ చైతన్య పాన్ ఇండియా డైరెక్టర్ చందు మొండేటి డైరెక్షన్ లో “తండేల్ “ సినిమాలో నటిస్తున్నాడు.. ఈ సినిమాలో నాగ చైతన్య సరసన న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది.. ఈ సినిమాను మేకర్స్ డిసెంబర్ లో రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే నాగ చైతన్య టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరో గా కొనసాగుతూనే హైదరాబాద్ లో ఒక రెస్టారంట్ ని స్థాపించి సక్సెస్ ఫుల్ బిజినెస్ మ్యాన్ గా కూడా నిరూపించుకున్నాడు.. కేవలం రెస్టారంట్ మాత్రమే కాదు, ఆయనకు వివిధ రాష్ట్రాల్లో పలు వ్యాపారాలు కూడా ఉన్నాయి. అయితే నాగ చైతన్య రీసెంట్ గా ఆయన సోషల్ మీడియా లో పెట్టిన పోస్ట్ తెగ వైరల్ అవుతుంది..ఆయన మాట్లాడుతూ ‘2013 వ సంవత్సరం లో నేను కేవలం 5 డాలర్లకు ఒక బిట్ కాయిన్ ని కొనుగోలు చేశాను. ఇప్పుడు ఆ బిట్ కాయిన్ ధర 6 మిలియన్ డాలర్స్ కి చేరింది. అంటే ఇండియన్ కరెన్సీ లెక్కల ప్రకారం 50 కోట్ల రూపాయలకు పైమాటే. ఇప్పుడు నేను దీనిని అమ్మేయాలని అనుకుంటున్నాను, దీనికి మీరేమంటారు?’ అని నాగ చైతన్య ట్వీట్ వేసాడు.ప్రస్తుతం ఆ ట్వీట్ తెగ వైరల్ అవుతుంది.. లక్ అంటే నీదే.. జాక్పాట్ కొట్టావుగా.. కంగ్రాట్స్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: