ప్రకాష్ రాజ్ ను బాయ్ కాట్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్న మెగా ఫ్యామిలీ.?

FARMANULLA SHAIK
టాలీవుడ్ ఇండస్ట్రీలో విలక్షణమైన నటుడిగా ప్రకాష్ రాజ్ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకోవడంతో పాటు తన సక్సెస్ రేట్ ను అంతకంతకూ పెంచుకుంటున్నారు. దేవర  సినిమాలో సింగప్ప అనే పాత్రలో నటించిన ప్రకాష్ రాజ్ తన నటనతో పాత్రకు ప్రాణం పోశారనే చెప్పాలి. అయితే ప్రకాష్ రాజ్ ఈ మధ్య కాలంలో పలు వివాదాల ద్వారా కూడా వార్తల్లో నిలిచారనే సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ ప్రకాష్ రాజ్ కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో తిరుమల లడ్డూలో  కల్తీ నెయ్యి వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ అంశంపై చాలా మంది తమదైన శైలిలో స్పందిస్తున్నారు. బాధ్యులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కొంతమంది కోరుతుంటే.. అనవసరంగా రాజకీయం చేస్తున్నారని మరికొంతమంది విమర్శిస్తున్నారు. ఇదే అంశంపై సినీ నటుడు ప్రకాశ్ రాజ్ కూడా స్పందించారు. ఆయన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్  టార్గెట్ గా పోస్ట్లు చేస్తుండడం ఇప్పుడు ఆసక్తి కలిగిస్తోంది. ఒకప్పుడు మెగాస్టార్ ఫ్యామిలీతో అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగిన ప్రకాశ్ రాజ్ ఇప్పుడు వ్యతిరేక పోస్టులు పెడుతుండడంపై మెగా ఫ్యాన్స్ ఫుల్ ఫైర్ అవుతున్నారు.
లడ్డూలో కల్తీ నెయ్యి వాడడం ద్వారా తిరుమల  పవిత్రతను గత వైసీపీ  ప్రభుత్వం దెబ్బ తీసిందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విమర్శించారు. అందుకు ప్రాయశ్చిత్తంగా ఆయన 11 రోజులపాటు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. కనక దుర్గ ఆలయ మెట్లను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపాయి. ప్రకాశ్ రాజ్ అంటే తనకు గౌరవం ఉందని,అయితే సనాతన ధర్మాన్ని కించపరిచేలా మాట్లాడడం తగదని ఆయన సూచించారు. అయితే తాను తప్పేమీ మాట్లాడలేదని విదేశాల నుంచి వచ్చాక వివరణ ఇస్తానని చెప్పారు. అంతటికే ఆగకుండా కార్తీతో సారీ చెప్పించుకోవడాన్ని ప్రకాశ్ రాజ్ ప్రశ్నించారు. వరుస పోస్ట్ లతో పవన్ కల్యాణ్ ను ఇరుకున పెట్టారు.
అయితే ప్రకాశ్ రాజ్ కు, మెగా ఫ్యామిలీకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. గత మా ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ ను నిలబెట్టింది మెగా ఫ్యామిలీయే. ముఖ్యంగా నాగబాబు  ఆయనకు వెన్నంటి నిలబడ్డారు. మంచు విష్ణుకు  వ్యతిరేకంగా ప్యానెల్ నిలబెట్టి ప్రచారం చేశారు. మెగా ఫ్యామిలీ మొత్తం ప్రకాశ్ రాజ్ కు అండగా నిలబడింది. ప్రకాశ్ రాజ్ అప్పుడు కేసీఆర్ కు  సన్నిహితంగా ఉండడం.. వాళ్లు కూడా మెగా ఫ్యామిలీకి సపోర్ట్ గా నిలిచారనే ప్రచారం ఉంది. అయితే ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయినట్లు కనిపిస్తోంది.
ప్రకాశ్ రాజ్ బీజేపీ  వ్యతిరేకి అనే విషయం తెలిసిందే. బీజేపీపై విమర్శలు చేయడంలో ప్రకాశ్ రాజ్ ముందుంటారు. బీజేపీతో కలిసి జనసేన పనిచేస్తోంది. పైగా హిందువులు, గుళ్లకు సంబంధించిన వ్యవహారం కావడంతో సహజంగానే ప్రకాశ్ రాజ్ నెగెటివ్ స్టాండ్ తీసుకుంటారు. బీజేపీని టార్గెట్ చేసేందుకు రెడీగా ఉంటారు. ఇప్పుడు కూడా ఆయన అదే చేశారు. ఇలాంటి వాటిపైన రాద్ధాంతం అక్కర్లేదని.. కేంద్రంలో కూడా మీ మిత్రులే ఉన్నారు కాబట్టి చర్యలు తీసుకోండి అనేలా సెటైర్లు వేశారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన పవన్ కల్యాణ్ హిందువులంటే ఇంత చులకనా,మిగిలిన మతాల విషయంలో ఇలా ఎందుకు స్పందించరు.. అనేలా కామెంట్స్ చేశారు. మొత్తానికి మెగా ఫ్యామిలీతో ప్రకాశ్ రాజ్ కు గ్యాప్ బాగా పెరిగిపోయినట్లు అర్థమవుతోంది.
ఇదిలా ఉంటే సినీ ఇండస్ట్రీ కూడా ప్రకాష్ రాజ్ తీరుపై గుర్రుగా ఉంది. నిర్మాత నట్టి కుమార్ పవన్ కల్యాణ్‌ను విమర్శించే అర్హత ప్రకాష్ రాజ్‌కు లేదని తెలిపారు. ఇదే సమయంలో మెగా ఫ్యామిలీ కూడా ప్రకాష్ రాజ్‌పై కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఇక మీదట మెగా హీరోలు నటించే సినిమాల్లో ప్రకాష్ రాజ్‌ను తీసుకోకూడదనే నిర్ణయానికి మెగా ఫ్యామిలీ వచ్చినట్టు సమాచారం. పవన్ కల్యాణ్‌పై ప్రకాష్ రాజ్‌ చేసిన వ్యాఖ్యల కారణంగానే మెగా ఫ్యామిలీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో ఎంత వరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది. మొత్తానికి మెగా ఫ్యామిలీతో ప్రకాశ్ రాజ్ కు గ్యాప్ బాగా పెరిగిపోయినట్లు అర్థమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: