అన్ని కరెక్ట్ గా జరుగుంటే ఆ హీరోయిన్ మహేష్ బాబుకు తల్లి అయ్యుండేదా..? జస్ట్ మిస్..!
మహేష్ బాబు.. ఈ పేరు చెబుతుంటేనే ఏవో తెలియని వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈయన తన కెరియర్ లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు వేసుకున్నాడు. మరీ ముఖ్యంగా మురారి , రాజకుమారుడు ఇలాంటి సినిమాలు ఆయనను ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా దగ్గర చేశాయి . కాగా మహేష్ బాబు కెరియర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాల్సి ఉన్నా కూడా ..ఆ సినిమాలు యావరేజ్ టాక్ తో సరిపెట్టుకున్నాయి. అలాంటి సినిమాలు చాలానే ఉన్నాయి. అందులో ఒకటే "స్పైడర్".
ఈ సినిమా కథ , కంటెంట్ అంతా బాగున్నప్పటికీ ఎక్కడో మహేష్ బాబు ఫ్యాన్ బేస్ కి ఆనలేదు. మహేష్ బాబు కి తగ్గ రేంజ్ సినిమా కాదు ఇది అన్న ఫీలింగ్ ఘట్టమనేని ఫ్యాన్స్ లో ఉండిపోయింది . అందుకే ఈ సినిమా అలా మిక్స్డ్ టాక్ దక్కించుకుంది . కొంత మంది జనాలకి అసలు నచ్చలేదు. నిజానికి ఈ సినిమాలో మహేష్ బాబు తల్లి క్యారెక్టర్ లో నదియా నటించాల్సి ఉండిందా. కానీ నదియా ఈ ఆఫర్ ని సున్నితంగా రిజెక్ట్ చేసింది .
ఆ పాత్రకు తగిన ప్రాధాన్యత సినిమాలో లేకపోవడమే అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి . మొదటి నుంచి నదియా సినిమాలో హీరో హీరోయిన్ల తర్వాత తన క్యారెక్టర్ హైలెట్ అయ్యే విధంగా చూస్ చేసుకుంటుంది. అయితే స్పైడర్ సినిమాలో అంత కంటెంట్ లేకపోవడంతో నదియ ఆ ఆఫర్ రిజెక్ట్ చేసింది . ఒకవేళ అన్ని సెట్ అయి ఉంటే ఈ సినిమాలో మహేష్ బాబుకి తల్లిగా కనిపించి ఉండేది . నదియ మంచి ఛాన్స్ మిస్ చేసుకుంది. ఎప్పటినుంచో మహేష్ బాబుకి తల్లి పాత్రలో నదియా నటిస్తే చూడాలి అంటూ ఘట్టమనేని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు . ఆ కోరిక ఎప్పుడు తీరుతుందో..??