ఆయను నమ్ముకుని వడ్డీలు కట్టుకుంటూ మునిగిపోతోన్న దిల్ రాజు..?
సినిమా షూటింగ్ బాగా ఆలస్యం కావడంతో దిల్ రాజు కి బడ్జెట్ భారం భారీగా పెరిగింది..ఎప్పుడో పూర్తి అవ్వాల్సిన గేమ్ ఛేంజర్ ‘ఇండియన్ 2’ కారణంగా ఆలస్యం అయ్యింది. దీంతో దిల్ రాజు తన ఫైనాన్షియర్స్ కి వడ్డీలు దాదాపుగా 350 కోట్ల రూపాయిలు కట్టినట్టు ఇండస్ట్రీ లో టాక్ వినిపిస్తుంది..రామ్ చరణ్ ఈ చిత్రానికి భారీ రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం.. అలాగే శంకర్ రెమ్యూనరేషన్ కూడా 40 కోట్ల రూపాయలు ఉన్నట్లు సమాచారం..గేమ్ ఛేంజర్ పూర్తి స్థాయి బడ్జెట్ అంచనా వేస్తె 650 కోట్ల రూపాయలకు పైనే ఉంటుందని సమాచారం.అయితే ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ తోనే ఇప్పటికీ 250 కోట్ల రూపాయిల వరకు జరిగిందని, ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ప్రపంచవ్యాప్తంగా మరో 200 కోట్ల రూపాయలకు జరుగుతుందని సమాచారం.అయితే సినిమా విడుదలై సూపర్ హిట్ టాక్ ని తెచ్చుకుంటే దిల్ రాజు గట్టెక్కుతాడు లేకుంటే దిల్ రాజుకు భారీ నష్టాలు తప్పవు..