కోలీవుడ్ స్టార్
హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం
ధనుష్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు..రీసెంట్ గా రాయన్ సినిమాతో
ధనుష్ నటుడుగానే కాకుండా దర్శకుడిగా కూడా అద్భుతమైన హిట్ అందుకున్నాడు.. ప్రస్తుతం
ధనుష్ టాలీవుడ్ టాప్
డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘కుబేర’ అనే సినిమాలో నటిస్తున్నాడు.. ఈ సినిమాలో
టాలీవుడ్ సీనియర్ స్టార్
హీరో అక్కినేని
నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్నాడు.. నేషనల్
క్రష్ రష్మిక
హీరోయిన్ గా నటిస్తుంది..
ధనుష్ ప్రొఫెషనల్ లైఫ్ బాగానే సాగుతున్న
ధనుష్ పర్సనల్ లైఫ్ లో మాత్రం ఎన్నో వివాదాలు వున్నాయి..వాటిలో తన
భార్య ఐశ్వర్య రజినీకాంత్ కు విడాకులు ఇవ్వడం కూడా ఒకటి.
సూపర్ స్టార్ రజినీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్యతో
ధనుష్ వివాహం 2004 లో ఎంతో వైభవంగా జరిగింది. ఈ క్యూట్ జంటకు ఇద్దరు పిల్లలు. అయితే దాదాపు 18 ఏళ్ల దాంపత్యం తరువాత ఈ జంట 2022 లో విడాకులు ప్రకటించింది.తాము ఎన్నో విధాలుగా ప్రయత్నించినా కూడా .. కలిసి ఉండడం కుదరకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు.
అయితే వీరి విడాకులు అటు
ధనుష్ ఫ్యామిలీ
కి కానీ అలాగే
రజినీ ఫ్యామిలీ
కి కానీ ఇష్టం లేదు. వీరిద్దరిని కలపడానికి ఆ రెండు కుటుంబాలు చాలా ప్రయత్నాలు చేశాయి.
ధనుష్ తండ్రి అయితే
మీడియా ముందే ఈ విషయాన్ని తెలిపారు..అయితే
ధనుష్ విడాకులు తీసుకుంటున్నట్లు మాత్రమే ప్రకటించారు.. ఇంకా వీరి కేసు కోర్టు లో నడుస్తోంది. ధనుష్- ఐశ్వర్యను కలపడానికి ఇరు కుటుంబాలు ఎంతగానో ప్రయత్నిస్తున్నాయి.తాజాగా వీరి విడాకుల కేసు విచారణకు వచ్చింది. నిన్న కోర్టులో విడాకుల విచారణకు
ధనుష్,
ఐశ్వర్య ఇద్దరిలో ఎవరూ కూడా హాజరు కాలేదు. దీంతో కోర్టు.. తదుపరి విచారణను
అక్టోబర్ 19 కి వాయిదా వేసింది. ఈ జంట హాజరుకాకపోవడంతో
కోలీవుడ్ లో అనేక అనుమానాలు మొదలయ్యాయి. ధనుష్-
ఐశ్వర్య విడాకులను రద్దు చేసుకోబోతున్నట్లు కధనాలు వస్తున్నాయి... అందుకు కారణం ..
రజినీకాంత్ అనారోగ్యం అని టాక్ వినిపిస్తుంది.గత కొంతకాలంగా
రజినీ అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఆయనని ఇంకా భాధపెట్టడం ఇష్టం లేకే వారు ఇలా చేసారని వార్తలు వినిపిస్తున్నాయి.. ఇందులో నిజమెంత వుందో తెలియాలి అంటే
అక్టోబర్ 19 వరకు ఎదురు చూడాల్సిందే..