సోషల్ మీడియాను హీటెక్కిస్తున్న కృతి శెట్టి.. ఈసారి మరింత సరికొత్త లుక్లో..?

MADDIBOINA AJAY KUMAR
అందాల ముద్దు గుమ్మ కృతి శెట్టి "ఉప్పెన" అనే సినిమా తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది . ఈ మూవీ సూపర్ సక్సెస్ కావడం , ఇందు లో ఈమె తన నటన తో , అందాల తో ప్రేక్షకులను ఆకట్టు కోవడం తో ఈ సినిమా తర్వాత ఈమె కు తెలుగు లో వరుసగా అవకాశాలు దక్కాయి . ఇక పోతే ఉప్పెన సినిమా తర్వాత ఈమె నటించిన కొన్ని మూవీలు మంచి విజయాలు అందుకోవడంతో ఈమె క్రేజ్ మరింతగా పెరిగింది.
 

దానితో కృతి కి తెలుగులో సినిమా అవకాశాలు కూడా విపరీతంగా పెరిగాయి. కానీ ఈ బ్యూటీ కి కొంత కాలం పాటు వరుస అపజయాలు ఎదురవుతూ వచ్చాయి. ఈ బ్యూటీ కొంత కాలం క్రితం శర్వానంద్ హీరోగా రూపొందిన మనమే అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. చాలా రోజుల తర్వాత ఈ సినిమాతో ఈ బ్యూటీ కి మంచి విజయం బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కింది. సినిమాల్లో తన అందాలను భారీగానే ఆరబోస్తూ వెండి తెరపై కుర్రకారకు సెగలు పుట్టిస్తున్న ఈ నటి సోషల్ మీడియాలో కూడా ఎక్కువ శాతం హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది.

ఇప్పటి వరకు ఈమెకు సంబంధించిన ఎన్నో హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా కూడా కృతి అదిరిపోయే లుక్ లో ఉన్న బ్లూ కలర్ డ్రెస్ ను వేసుకొని తన నడుము అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి. ఇలా ఎప్పటికప్పుడు కృతి శెట్టి తనకు సంబంధించిన హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూ వస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ks

సంబంధిత వార్తలు: