కొన్ని సినిమాలు కంటెంట్ పరంగా అద్భుతంగా వున్నా కానీ థియేటర్స్ లో రిలీజ్ అయ్యాక ప్రేక్షకులకి అంతగా కనెక్ట్ అవ్వవు.. అయితే అవే సినిమాలను టీవీలోకి వచ్చాక..సగటు ప్రేక్షకుడు ఇంత మంచి సినిమాను ఎందుకు ప్లాప్ చేసారబ్బా.. అని అనుకునే సందర్భాలు చాలానే వున్నాయి.. అలాంటి వాటిలో మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ‘ఖలేజా’ మూవీ ఒకటి..’అతడు’ వంటి సూపర్ హిట్ సినిమా తరువాత ఛాన్నాళ్లకు మహేష్, త్రివిక్రమ్ కాంబోలో ‘ఖలేజా’ సినిమా అనౌన్స్ చేసారు.. దీనితో ప్రేక్షకులలో ఈ కాంబో పై అంచనాలు తారాస్థాయికి చేరాయి..అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా మొదట పార్వతీ మెల్టన్ ను తీసుకున్నారు. కొంత భాగం ఆమెతో షూటింగ్ కూడా జరిపారు. తర్వాత కొన్ని కారణాల వల్ల ఆమె తప్పుకోవడంతో అనుష్క హీరోయిన్ గా వచ్చి చేరడం జరిగింది.ఈ సినిమా 60 శాతం షూటింగ్ రాజస్థాన్ వంటి ఏరియాలో చేశారు. మొదట ఈ సినిమాకి ‘దైవం మనుష్య రూపేణ’ అనే టైటిల్ ను మేకర్స్ ఫిక్స్ చేసారు..కానీ మహేష్ కి ఉన్న మాస్ ఇమేజ్ ని దృష్టిలో ఉంచుకొని ‘ఖిలాడీ’ గా టైటిల్ మార్చారు.చివరికి ‘ఖలేజా’ టైటిల్ కు మూవీ టీం ఫిక్స్ అయింది.. అయితే ఈ సినిమా టైటిల్ విషయంలో అప్పట్లో పెద్ద రచ్చ జరిగింది..ఒక చిన్న సినిమాకి అప్పటికే ఆ టైటిల్ రిజిస్టర్ చేసుకోవడంతో ‘మహేష్ ఖలేజా ’ గా టైటిల్ మార్చాల్సి వచ్చింది.
మొత్తానికి ఈ సినిమా 2010 అక్టోబర్ 7 వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. మహేష్ సినిమా చూసేందుకు ఫ్యాన్స్ థియేటర్స్ కి క్యూ కట్టారు..కానీ ఖలేజా సినిమాకు మొదటి షో నుంచే నెగిటివ్ టాక్ వచ్చింది.సినిమా టైటిల్ కి సినిమా కథకు ఏమైనా సంబంధం వుందా అని ప్రేక్షకులు విమర్శించారు.. అదే కాకుండా మధ్యలో ‘దేవుడు’ కాన్సెప్ట్ ఏంటి భయ్యా అంటూ త్రివిక్రమ్ ని మహేష్ ఫ్యాన్స్ ఓ రేంజ్లో కడిగేసారు..కానీ ఈ సినిమా ఫలితం సంగతి పక్కన పెడితే.. మహేష్ కెరీర్ లోనే మైల్ స్టోన్ మూవీగా ఖలేజా సినిమా చెప్పుకోవచ్చు.. ఈ సినిమాలో మహేష్ చేసిన పెర్ఫార్మన్స్ అద్భుతం అని చెప్పొచ్చు..”అద్భుతం జరిగే ముందు ఎవరు గుర్తించకపోవచ్చు జరిగాక ఎవరూ గుర్తించాల్సిన అవసరం లేదు”.. వంటి త్రివిక్రమ్ రాసిన డైలాగ్స్ వాల్యూ ప్రేక్షకులకు సినిమా ప్లాప్ అయిన కొన్నాళ్లకు తెలిసింది.. టీవీల్లో ఈ సినిమాని చూశాక చాలా మంది ప్రేక్షకులు తమ అభిప్రాయాన్ని మార్చుకున్నారు.ఇంత మంచి సినిమా ఎందుకు ప్లాప్ చేశామా అని ఫీల్ అయ్యారు.. ఈ సినిమాలో మెయిన్ అట్రాక్షన్ మణిశర్మ బాక్గ్రౌండ్ స్కోర్.. హీరో ప్రతి ఎలివేషన్ కి గూస్ బంప్స్ వస్తాయి.. అలాంటి అద్భుతమైన ఖలేజా సినిమాకు నేటితో 14 ఏళ్లు పూర్తి అయింది.. ఈ సినిమా రీరిలీజ్ కోసం మహేష్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు..