NBK109 : అతి పెద్ద స‌స్పెన్స్‌లో పెట్టేశారుగా... !

RAMAKRISHNA S.S.
- బాల‌య్య 109 సినిమా టైటిల్ ఎప్పుడు .. !
- సంక్రాంతి రేసులో బాల‌య్య - బాబి సినిమా .. ?
- హ్యాట్రిక్ హిట్ల త‌ర్వాత వ‌స్తోన్న నంద‌మూరి న‌ట‌సింహం సినిమా .. !

- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .

నందమూరి నటసింహం బాలకృష్ణ ఇప్పుడు త‌న కెరీర్ లో హ్యాట్రిక్ హిట్లు కొట్టి ఫుల్ ఫామ్ లో ఉన్నారు. అఖండ - వీర‌సింహా రెడ్డి - భ‌గ‌వంత్ కేస‌రి ఈ మూడు సినిమా ల‌తో సూప‌ర్ డూప‌ర్ హిట్లు అయ్యాయి. ప్ర‌స్తుతం బాల‌య్య హీరోగా ఇప్పుడు తన కెరీర్ లో 109వ సినిమా ను యువ దర్శకుడు కేఎస్‌. ర‌వీంద్ర ( బాబీ ) కొల్లి తో చేస్తున్న సంగతి తెలిసిందే. మరి భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా షూటింగ్ అయితే ప్లాన్ ప్రకారం న‌డుస్తున్నా అప్‌డేట్ల విష‌యం లో మాత్రం ఫ్యాన్స్ బాగా డిజ‌ప్పాయింట్ అన్నారు.

ఇక సినిమా నుంచి అర‌కొర అప్ డేట్లు మాత్ర‌మే వ‌స్తున్నాయి. ఇవి ప‌క్క‌న పెడితే సినిమా టైటిల్ ఏంటి అనేది ఇంకా రివీల్ చేయ‌కుండా నాన్చుతూ వ‌స్తున్నారు. ఇంకా టైటిల్ పెట్ట‌క పోవ‌డం.. రివీల్ చేయ‌క పోవ‌డం అనేది బాలయ్య అభిమానుల్లో మరింత సస్పెన్స్ గా మారింది. అయితే ఇది వరకే పలు సందర్భాల్లో రిలీజ్ చేసే ప్లాన్ కూడా చేశార‌ని తెలుస్తోంది.

అయితే టైటిల్ ఎప్పుడు రివీల్ చేస్తారు ? అనేది ఫ్యాన్స్ లో మరింత సస్పెన్స్ గా మారింది. మరి ఈ దసరా కానుకగా అనౌన్స్ చేసే ఛాన్స్ ఉందని కొన్ని క‌థ‌నాలు టాలీవుడ్ స‌ర్కిల్స్ లో వినిపిస్తున్నాయి. థమన్ సంగీతం అందిస్తుండగా నాగవంశీ, త్రివిక్రమ్ లు నిర్మాణం వహిస్తున్నారు. వ‌చ్చే సంక్రాంతి కానుక‌గా ఈ సినిమాను థియేట‌ర్ల లోకి తీసుకు వ‌చ్చే ప్లాన్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: