మెగాస్టార్ చివరిగా నటించిన మల్టీ స్టారర్ మూవీ అదేనా..?

murali krishna
టాలీవుడ్‌లో ఇప్పటికీ కొంతమంది హీరోలు తమ చిత్రంలో మరో హీరో కనిపిస్తాడన్నా, ఇతర హీరోల సినిమాలో చిన్న పాత్ర పోషించాలన్నా భయపడుతుంటారు. అలా మల్టీస్టారర్, లేదంటే ఇంకో హీరో ఉన్న సినిమాలో నటిస్తే ఏమవుతుందో? అనుకుంటారు. ఇలా నటిస్తే ఏం జరుగుతుందో? ఎవరికి ప్రాధాన్యత ఉంటుంది? అంటూ లెక్కలేసుకుంటుంటారు. కానీ కృష్ణంరాజు దీనికి పూర్తిగా భిన్నం. ఎందుకంటే ఆయన 180 సినిమాలకుపైగా నటిస్తే… అందులో 40కిపైగా ఇతర నటులతో కలిసి నటించినవే కావడం గమనార్హం.తన తరం వారితోనే కాకుండా, ఈతరం తారలతోనూ చాలాసార్లు స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నారు కృష్ణంరాజు.ఈ నేపథ్యంలో పులి బెబ్బులి 1983 లో కెఎస్ఆర్ దాస్ దర్శకత్వంలో వచ్చిన టాలీవుడ్ చిత్రం. ఈ చిత్రంలో కృష్ణంరాజు, చిరంజీవి, జయప్రద, రాధిక ముఖ్య పాత్రల్లో నటించారు.కమల సినీ ఆర్ట్స్ పతాకంపై ఆర్.వి. గురుపాదం ఈ చిత్రాన్ని నిర్మించాడు.ఈ చిత్రం చిరంజీవి చివరిగా చేసిన మల్టీస్టారర్ చిత్రం.ఇదిలావుండగా మెగాస్టార్ చిరంజీవి జీవితాన్ని మార్చేసిన ఏడాది 1983. ఈ ఏడాది చిరంజీవి కెరీర్ లో చాలా అద్భుతాలు, అరుదైన సంఘటనలు జరిగాయి. చిరంజీవికి అత్యధిక చిత్రాల్లో నటించింది ఈ ఏడాదిలోనే. ఏకంగా 13 చిత్రాల్లో నటించారు. ఈ ఏడాది చిరంజీవి మొదటగా నటించిన చిత్రం ప్రేమ పిచ్చోళ్ళు. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం యావరేజ్ నిలిచింది. 

పల్లెటూరి మొనగాడు. ప్రేమ పిచ్చోళ్ళు, అభిలాష, ఆలయ శిఖరం, శివుడు శివుడు శివుడు, పులి బెబ్బులి, గూఢచారి నెంబర్ 1, మగమహారాజు, రోషగాడు, సింహపురి సింహం, ఖైదీ, మంత్రిగారి వియ్యంకుడు, సంఘర్షణ ఇలా మొత్తం 13 చిత్రాల్లో నటించారు. ఇక తన స్నేహితుడు ప్రసాద్ బాబు కోరిక మేరకు ఇదే ఏడాది మా ఇంటి ప్రేమాయణం చిత్రంలో అతిథి పాత్రలో నటించారు. ఇక చిరంజీవి తన మిత్రుడు.. రెబల్ స్టార్ కృష్ణంరాజుతో చివరగా కలసి నటించింది కూడా ఈ ఏడాదే. పులి బెబ్బులి చిత్రంలో చిరు, కృష్ణం రాజు హీరోలుగా నటించారు. వీళ్ళిద్దరూ మొగల్తూరు నుంచి వచ్చి టాలీవుడ్ లో అగ్ర నటులుగా ఎదిగినవారే. చిరంజీవివి చివరగా నటించిన మల్టీస్టారర్ చిత్రం కూడా ఇదే. ఇదిలావుండగా ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విశ్వంభర’. పాన్ ఇండియా స్థాయిలో సోషియో ఫాంటసీ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వం వ‌హిస్తుండ‌గా.. కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ప్ర‌స్తుతం ఈ సినిమా శ‌ర‌వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న విష‌యం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాలో రెండు సాంగ్స్ షూటింగ్ మినహా అంతా పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఇవి కూడా త్వరలోనే పూర్తి చేసి ఈ జనవరిలోనే సినిమాను దింపే సన్నాహాలు మేకర్స్ చేస్తున్నట్లుగా సమాచారం అందింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: