కరోనా కాలం నుంచి ఓటీటీల హవా నడుస్తోంది. ఒకప్పుడు థియేటర్లు దొరక్క విడుదల కానీ చిన్న సినిమాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడా పరిస్థితి మారిపోయింది. థియేటర్లు దొరకకపోతేనేం.. డైరెక్టుగా ఓటీటీలోనే విడుదల చేస్తున్నారు నిర్మాతలు. ఇలా విడుదలైన సినిమాలు ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఓటీటీ హవా ఎంతగా నడుస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. థియేటర్లలో విడుదలైన 20 నుంచి 25 రోజుల లోపే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. కాబట్టి జనాలు కూడా థియేటర్స్‌కి వెళ్లి మూవీ చూడటానికి అంత ఇష్టపడట్లేదు. అయితే వీటిలో ఉండే మూవీస్ కూడా వివిధ జోనర్లలో ఉంటాయి. అందులో సస్పెన్స్, హారర్, ఇన్విస్టిగేషన్ థ్రిల్లర్, సోషల్ ఇన్స్పైర్, మోస్ట్ డిస్ట్రబెన్స్, రొమాంటిక్ మూవీ అంటూ పలు రకాల జోనర్స్ ఉన్నాయి.ఈ నేపథ్యంలో నే బోల్డ్ సినిమాలకు సెన్సార్ కష్టాలు రావడం అనేది కొత్తేమీ కాదు. అందులోని సీన్స్ ని బట్టి కట్స్ ఎక్కువగా చెప్పడం, లేదా కొన్ని పదాలను తొలగించడం వంటివి సెన్సార్ బోర్డు నుంచి వచ్చే ఆదేశాలని పాటిస్తేనే మూవీ సాఫీగా రిలీజ్ అవుతుంది.
ఇక ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న మూవీ థియేటర్లలో బ్యాన్ అయ్యింది. అది కూడా బోల్డ్ సీన్స్ కారణంగా. మరి ఈ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది? స్టోరీ ఏంటి? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.తెలుగు ప్రేక్షకులు ఎక్కువగా మొగ్గు చూపే ఓటిటి యాప్స్ లో ఆహా కూడా ఒకటి. ఈ బోల్డ్ కంటెంట్ ఉన్న మూవీ పక్కా తెలుగు మూవీ కావడం విశేషం. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న బోల్డ్ మూవీ ఆహాలో డైరెక్ట్ గా స్ట్రీమింగ్ అయింది. ఈ సినిమాకు యోగి వెలగపూడి దర్శకత్వం వహించగా, బోల్డ్ సీన్లు, బోల్డ్ డైలాగ్స్ కారణంగా ఈ సినిమా మంచి బజ్ క్రియేట్ చేసింది. ఇందులో సూర్య శ్రీనివాస్, శివ బొడ్డు రాజు హీరోలుగా నటిస్తే, జెన్నిఫర్ ఇమాన్యుల్ హీరోయిన్ గా కనిపించింది. ఇద్దరు అబ్బాయిలతో ఒక అమ్మాయి ఒకేసారి రిలేషన్ షిప్ లో ఉంటే ఎలా ఉంటుంది ? అనే కాన్సెప్ట్ తో ఈ సినిమాను యోగి వెలగపూడి చాలా బోల్డ్ గా రూపొందించారు.మరి ఈ అడల్ట్ కంటెంట్ మూవీ ని చూడాలంటే ఆహా వైపు అడుగులు వేయ్యాల్సిందే.