వెంకీ-2 మూవీపై ఆసక్తికరవ్యాఖ్యలు చేసిన శ్రీను వైట్ల.?

FARMANULLA SHAIK
రవితేజ హీరోగా దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించిన యాక్షన్ కామెడీ చిత్రం ‘వెంకీ’. ఈ సినిమాకి టాలీవుడ్ ఆడియన్స్ లో ఓ ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా ట్రైన్ సీక్వెన్స్ లో వచ్చే కామెడీ సీన్ ఎవర్ గ్రీన్ గా నిలిచిపోయింది. రవితేజ, బ్రహ్మానందం, ఏవీఎస్, వేణుమాధవ్, శ్రీనివాస్ రెడ్డి, చిత్రం శ్రీను కలిసి చేసిన కామెడీ.. ఇప్పటి ఆడియన్స్ ని కూడా విపరీతంగా నవ్విస్తూ ఉంటుంది.ఇక ఈ కామెడీ సీన్ టెంప్లేట్స్ తో మీమర్స్ క్రియేట్ చేసే మీమ్స్ మరింత గిలింతలు పెడుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అందువలనే ఈ చిత్రానికి టాలీవుడ్ ఆడియన్స్ లో ఓ ప్రత్యేక స్థానం అలా ఉండిపోయింది.2004 వ సంవత్సరం మార్చి 26 న రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.ఇదే సినిమాని.. 2023 చివర్లో అంటే డిసెంబర్ 30 న ఈ సినిమాని రీ రిలీజ్ చేయగా.. చాలా మంది ప్రేక్షకులు ఎగబడి చూశారు.అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.అంతలా ఈ సినిమాకి కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు అని చెప్పాలి. శ్రీను వైట్ల డైరెక్షన్ కోన వెంకట్, గోపీమోహన్ ..ల సంభాషణలు, దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్, రవితేజ- స్నేహ ల కెమిస్ట్రీ, బ్రహ్మానందం -ధర్మవరపు సుబ్రహ్మణ్యం - ఏ.వి.ఎస్ , కృష్ణ భగవాన్ ల కామెడీ,కలగలిపి ‘వెంకీ’ ని రిపీటెడ్ గా ప్రేక్షకులు చూసేలా చేశాయి అని చెప్పవచ్చు.అయితే ఇప్పుడు దర్శకుడు శ్రీను వైట్ల ‘వెంకీ 2 ‘ చేయడానికి రెడీ అవుతున్నట్టు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. 

ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సిక్వెల్ ఎవరితో తీస్తారనే ప్రశ్నకు దర్శకుడు శ్రీను వైట్ల ఆసక్తికర సమాధానమిచ్చారు.ప్రస్తుత తరం హీరోల్లో అందరు మంచి కామెడీ టైమింగ్ ఉన్నవాళ్లేనని చెప్పారు. వారిలో ఎవ్వరికైనా అవుతుందన్నారు. తాను ఏ హీరో తో పనిచేస్తే వారి తో ఫ్రెండ్షిప్ కొనసాగిస్తానని తెలిపారు.ఇదిలావుండగా వెంకీ 2పై వస్తున్నా వార్తలను బట్టి ‘వెంకీ’ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంతోషించే వార్త అయితే కాదు. ఎందుకంటే ఇప్పుడు శ్రీను వైట్ల ఫామ్లో లేడు.’బాద్ షా’  తర్వాత అతను సినిమాలు అన్నీ ఒకదాన్ని మించి మరొకటి అన్నట్టు ఫ్లాప్ అయ్యాయి.ఇలాంటి టైంలో ‘వెంకీ 2 ‘ చేసి ‘వెంకీ’ కల్ట్ ఫ్యాన్స్ ని హర్ట్ చేయడం అవసరమా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.’శ్రీను వైట్ల అనుకుంటే సరిపోతుందా రవితేజ కూడా ‘వెంకీ 2 ‘ కి ఓకే చెప్పాలిగా..! ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ దెబ్బకి అతను మళ్ళీ శ్రీను వైట్లని నమ్మే అవకాశం అయితే ఉండకపోవచ్చు’ అనే కామెంట్స్ కూడా ఇప్పుడు వినిపిస్తున్నాయి.'దుబాయ్ శీను' ఉండగా 'వెంకీ 2 ' ఎందుకు? 'వెంకీ' మంచి కల్ట్ మూవీ! దానికి పార్ట్ 2 తీసి.. చెడగొట్టాలా అని వెంకీ మూవీ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: