పవన్ విషయంలో నేటిజన్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మాజీ భార్య.?

FARMANULLA SHAIK
రేణు దేశాయ్ ఏం చేసినా సరే అది క్షణంలో వైరల్ అవుతుంది. తాజాగా ఆమె 'అలాంటి పనులు చేసే మీకు ఖచ్చితంగా నరకమే దిక్కు' అంటూ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.మరి ఆమె ఎవరిని ఉద్దేశించి ఈ కామెంట్ చేసిందో తెలుసుకుందాం.రేణు దేశాయ్ సినిమాలో పెద్దగా యాక్టివ్ గా లేకపోయినా బయట జరిగే ఏ విషయంపైనైనా తన అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పేస్తుంది. ఇక ఈ అమ్మడు జంతు ప్రేమికురాలు అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆమె ఇంట్లో పిల్లల్ని పెంచుకోవడమే కాదు కుక్కల వైద్యం కోసం విరాళాలు ఇవ్వడం, సేకరించడం లాంటి పనులు కూడా చేస్తుంది. ముఖ్యంగా పెట్స్ కోసం పని చేసే పలు స్వచ్ఛంద సంస్థలకు తన వంతుగా సాయం చేసి మూగజీవుల బాధను తగ్గించడానికి ఎప్పుడూ ముందుంటుంది. అయితే జంతు బలి అనేది ప్రస్తుతం సమాజంలో ఒక మూఢ నమ్మకంలా మారింది. ఏం మొక్కుకున్నా సరే జంతు బలి ఇస్తేనే దేవుళ్ళు తమను చల్లగా చూస్తారని భావించే వారి సంఖ్య భారీగానే ఉంది. ఈ విషయంలో తాజాగా రేణు దేశాయ్ తాజాగా అగ్గిమీద గుగ్గిలం అయింది.ఈ నేపథ్యంలో కొందరు అఘోరాలు చేసిన జంతు బలి వీడియోను షేర్ చేస్తూ ఫైర్ అయింది రేణు దేశాయ్. తన ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో కొందరు అఘోరాలు దేవతకి మూగ జీవాలను బలిస్తున్న వీడియోను చూసి కలత చెందింది. ఆ వీడియోను షేర్ చేస్తూ ‘ఇలా బలిచ్చి, మూగజీవాలను చంపేస్తే ఏ దేవత, దేవుడు సంతోషిస్తాడని ఈ పిచ్చి జనాలు నమ్ముతున్నారు?’ అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించింది. ‘బిడ్డల రక్తం కళ్ల చూసి ఏ తల్లి సంతోషిస్తుంది? ఇలాంటి పనులు చేసే వారికి తప్పకుండా నరకంలో చోటు దక్కుతుంది’ అంటూ తన ఆవేదనను సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. దీంతో పలువురు రేణు దేశాయ్ కి సపోర్ట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.
రీసెంట్ గా ‘దేవర’ మూవీ సెలబ్రేషన్స్ లో భాగంగా కూడా కొందరు ఇలా మూగ జీవాలను బలి ఇవ్వడం ఆశ్చర్యాన్ని కలిగించింది.ఇదిలావుండగా పవన్‌కు విడాకులు ఇచ్చి తప్పు చేశారని ఓ నెటిజన్ కామెంట్ చేయగా, మా పవన్ అన్నయ్యలాగా గొప్ప మనసు ఉన్నవారు అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. వీరిపై చేసిన కామెంట్స్‌పై రేణు దేశాయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పవన్‌ను నేను వదిలేయలేదని..ఆయనే నన్ను వదిలేసి మరో అమ్మాయిని వివాహం చేసుకున్నారని చెబుతూ వారికి స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. ఇదే సమయంలో సమాజంలో జరుగుతున్న తప్పులపై రేణు దేశాయ్‌ ఎప్పటికప్పుడు తనదైనశైలిలో స్పందిస్తుంటారు. ఇటీవలే ఓ యువకుడు కుక్కను గిరగిరా తిప్పి అవతల పడేసిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అయింది. ఆ వీడియోపై రేణు దేశాయ్ రియాక్ట్ అయ్యారు. ఆ వీడియోను షేర్ చేస్తూ...అతని అడ్రస్, ఫోన్ నెంబర్ చెప్పాలంటూ పోస్ట్ షేర్ చేశారు.కుక్కను వేధించిన వ్యక్తి అరెస్ట్ అయ్యే వరకు రేణు దేశాయ్ వదిలిపెట్టలేదు. జంతువులను హింసిస్తే రేణు దేశాయ్ వేగంగా స్పందిస్తుంటారు.అంతేకాకుండా సోషల్ మీడియాలో తనమీద వచ్చే ఎలాంటి నెగెటివిటీనైనా ధైర్యంగా ఎదుర్కొని ధీటుగా సమాధానం చెబుతుంది. ఇక తన మీద వచ్చే ట్రోలింగ్ అయితే భరిస్తుంది కానీ తన పిల్లలు అఖీరా, ఆద్యలని ఎవరైనా టార్గెట్ చేస్తే అస్సలు ఊరుకోదు. అంతేకాకుండా ఎవరైనా తన పిల్లల జోలికి వస్తే ఊరుకునేది లేదంటూ గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది రేణు దేశాయ్. అయితే గత కొన్ని రోజులుగా రేణు వివడాలకు దూరంగా ఉంటూ వస్తోంది. మరోవైపు పవన్ ఫ్యాన్స్ కూడా ఆమెపై ఇంతకుముందులా నెగెటివ్ కామెంట్స్ చేయట్లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: