గంగోత్రి మూవీతో హీరోగా సిల్వర్ స్క్రీన్ కి పరిచమయ్యాడు అల్లు అర్జున్. ఆ మూవీ పర్లేదు అనిపించుకుంది. యంగ్ విలేజ్ బాయ్ పాత్రలో అల్లు అర్జున్ కనిపించారు.అప్పటి అల్లు అర్జున్ లుక్ ఒకింత విమర్శల పాలైంది. అయితే రెండో చిత్రంతో తానేమిటో నిరూపించుకున్నాడు. దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఆర్య బ్లాక్ బస్టర్ అందుకుంది. . ఓ విభిన్నమైన ప్రేమ కథను సుకుమార్ అద్భుతంగా తెరకెక్కించాడు. ఈ మూవీలో అల్లు అర్జున్ డాన్సులు సినిమాకు హైలెట్.. అల్లు అర్జున్ ఫేవరెట్ దర్శకుల్లో సుకుమార్ ఒకడు. ఆయనతో ఇప్పటి వరకు మూడు చిత్రాలు చేశారు. సుకుమార్-అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన మూడో చిత్రం పుష్ప పాన్ ఇండియా హిట్. అల్లు అర్జున్ నేషనల్ వైడ్ ఫేమ్ రాబట్టాడు. పుష్ప చిత్రానికి కొనసాగింపుగా పుష్ప 2 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పుష్ప 2 డిసెంబర్ 6న విడుదల కానుంది.సుకుమార్ తో పాటు అల్లు అర్జున్ కి త్రివిక్రమ్ ఇష్టమైన దర్శకుడు. వీరిద్దరి కాంబినేషన్ లో మూడు చిత్రాలు తెరకెక్కాయి. జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో వీరిద్దరి కాంబోలో రూపొందిన చిత్రాలు. 2020 సంక్రాంతి కానుకగా విడుదలైన అల వైకుంఠపురములో ఇండస్ట్రీ హిట్. భారీ వసూళ్లు రాబట్టిన చిత్రం ఇది.సన్ ఆఫ్ సత్యమూర్తి సైతం హిట్ స్టేటస్ అందుకుంది.
అయితే సన్ ఆఫ్ సత్యమూర్తి డిజాస్టర్ కావాల్సిందట. కమెడియన్ ఆలీ చేసిన సూచనతో ఆ ప్రమాదం తప్పింది. సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రంలో కన్నడ స్టార్ ఉపేంద్ర ఓ కీలక రోల్ చేశాడు. నెగిటివ్ షేడ్స్ తో కూడి ఉంటుంది. సినిమాకు ఉపేంద్ర పాత్ర చాలా కీలకం. కాగా ఉపేంద్ర తన పాత్రకు సొంతగా డబ్బింగ్ చెప్పాడట. ఉపేంద్ర వాయిస్ విన్న ఆలీ అనుమానం వ్యక్తం చేశాడు . ఆ పాత్రకు ఉపేంద్ర వాయిస్ సెట్ కాలేదని థియేటర్ లో జనాలు ఈ వాయిస్ వింటే సినిమాపై ఎఫెక్ట్ పడుతుంది అని అలీ త్రివిక్రమ్ తో వాదించారు.దీనితో త్రివిక్రమ్ మరోసారి ఉపేంద్ర డబ్బింగ్ విని నిజమే తేడాగా అనిపిస్తోంది అని చెప్పారట. మార్చేద్దాం అనుకుంటున్న సమయంలో ఎవరైతే బావుంటుంది అని ఆలోచించారు. అప్పుడు అలీ.. ఉపేంద్ర పాత్రకి రవిశంకర్ డబ్బింగ్ చెబితే బావుంటుంది అని సలహా ఇచ్చారు. రవిశంకర్ టాలీవుడ్ లో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా నటుడిగా రాణిస్తున్నారు. ఆయన సాయి కుమార్ సోదరుడు. త్రివిక్రమ్ వెంటనే రవిశంకర్ ని పిలిపించి ఉపేంద్ర పాత్రకి డబ్బింగ్ చెప్పించారు. ఆ విధంగా అలీ.. సన్నాఫ్ సత్యమూర్తి చిత్రం ఫ్లాప్ కాకుండా కాపాడారు.