నితిన్ వింత కష్టం.. చేతికి రానున్న రెండు సినిమాలు.. కానీ విడుదల తేదీలు మాత్రం లేవు..?

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమ లో మంచి గుర్తింపు కలిగిన యువ నటుల లో నితిన్ ఒకరు . ఈయన కెరియర్ ప్రారంభం లో వరస విజయాలను అందుకుంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు . ఆ తర్వాత కొంత కాలం పాటు వరుస అపజయాలను అందుకున్నాడు . ఇక పోతే మళ్ళీ ఈ మధ్య కాలంలో నితిన్ కు బాక్స్ ఆఫీస్ దగ్గర చేదు అనుభవాలు వరుస గా ఎదురవుతున్నాయి . ఇది ఇలా ఉంటే ప్రస్తుతం నితిన్ ఏక కాలంలో రాబిన్ హుడ్ , తమ్ముడు అనే సినిమాలలో హీరో గా నటిస్తూ వస్తున్నాడు . రాబిన్ హుడ్ మూవీ కి వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తూ ఉండగా , తమ్ముడు మూవీ కి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం రాబిన్ హుడ్ మూవీ కి సంబంధించిన షూటింగ్ మరో 25 రోజుల్లో పూర్తి కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక తమ్ముడు మూవీ కి సంబంధించిన షూటింగ్ మరో 13 రోజుల్లో కంప్లీట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక దాదాపు నెల రోజుల్లోపు ఈ రెండు సినిమాలు చేతికి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాకపోతే ఈ మూవీ లకు సంబంధించిన విడుదల తేదీలను మాత్రం ఇప్పటి వరకు ఈ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించలేదు.

ఇక రాబిన్ హుడ్ సినిమాను డిసెంబర్ నెలలో విడుదల చేయనున్నట్లు వార్తల వైరల్ అయిన ఆ నెలలో అనేక క్రేజీ సినిమాలు ఉండడంతో ఈ మూవీ డిసెంబర్ నెలలో విడుదల కష్టం అని తెలుస్తుంది. మరి రాబిన్ హుడ్ , తమ్ముడు సినిమాల విడుదల తేదీలను ఎప్పుడు ప్రకటిస్తారా ..? ఈ సినిమాలను ఎప్పుడు విడుదల చేస్తారా అనేది తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: