కోర్టు మెట్లు ఎక్కిన నాగార్జున.. అంతలోనే..?
నాగార్జున స్టేట్‌మెంట్ మాత్రమే కాకుండా అందరి సాక్షుల వాంగ్మూలాలను కూడా రేపే రికార్డు చేయాలని న్యాయవాది అశోక్ రెడ్డి కోర్టు ఎదుట విజ్ఞప్తి చేశారు. నాంపల్లి కోర్ట్ వాదనలన్నీ విన్న తర్వాత తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. అంటే రేపు నాగార్జున కోర్ట్‌కు హాజరై తన వాంగ్మూలం ఇవ్వాల్సి ఉంటుంది.
నాగచైతన్య, సమంత, బీఆర్ఎస్ నేత కేటీఆర్, నాగార్జున ల గురించి మంత్రి కొండా సురేఖ సంచలన అలివేషన్స్ చేశారు. ఎన్ కన్వెన్షన్‌ను కూల్చివేయకుండా ఉండాలంటే సమంత తన దగ్గరకు రావాల్సిందే అని కేటీఆర్ డిమాండ్ చేశారట. అలాగే చేయమంటూ హీరో నాగార్జున, నాగచైతన్య ఫోర్స్ చేశారని, అందుకు సమంత ఒప్పుకోలేదని, ఆ కారణం చేతనే ఆమెకు విడాకుల చైతూ ఇచ్చాడని సురేఖ తీవ్ర ఆరోపణలు చేయడం జరిగింది. అక్కినేని ఫ్యామిలీ సమంత విషయంలో ఎంత దారుణంగా వ్యవహరించిందా అనే కోణంలో చర్చ మొదలయ్యింది. ఈ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని నాగార్జున అన్నారు కనీసం క్షమాపణలు కూడా ఆమె చెప్పలేదని మండిపడ్డారు. చివరికి ఆమెపై రూ. 100 కోట్ల డిఫామేషన్ కేసు వేశారు.
కొండా సురేఖ రాజకీయ దురుద్దేశంతో ఇలాంటి నిరాధార వ్యాఖ్యలు చేసారని, తమ కుటుంబ ఇమేజ్ ఇప్పుడు బాగా దెబ్బతింటుందని నాగార్జున తల్లడిల్లి పోతున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా నోటికి వచ్చింది మాట్లాడి తమ పరువుకు నష్టం కలిగించేలా ఆమె ప్రవర్తించిందని ఫైర్ అవుతున్నారు. తమ కుటుంబ గౌరవాన్ని, ప్రతిష్టను దెబ్బతీసేలా కామెంట్లు చేసే హక్కు ఆమెకు ఎక్కడిదని ప్రశ్నిస్తున్నారు. ఇకపోతే కొండా సురేఖ వ్యాఖ్యలపై తీవ్ర నిరసలు రేగాయి. అక్కినేని అమల కూడా బాగా బాధపడిపోతున్నట్లుగా తెలుస్తోంది. అమల చైతు అఖిల్ కోసమే నాగార్జున ఇప్పుడు గవర్నమెంట్ ఎక్కి పోరాటం చేస్తున్నారు రేపు ఆయన ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.