వారం రోజుల్లోనే ఓ ఫ్లాప్.. ఓ ఇండస్ట్రీ హిట్.. ఆ దర్శకుడికి వింత అనుభవం..?

MADDIBOINA AJAY KUMAR
సినిమా ఇండస్ట్రీలో అప్పుడప్పుడు వింత సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అలా ఒక వింత సంఘటన కొన్ని సంవత్సరాల క్రితం దర్శకుడు బి గోపాల్ కెరియర్లో కూడా జరిగింది. అసలు ఏం జరిగింది అనుకుంటున్నారా ..?  ఈ దర్శకుడు దర్శకత్వం వహించిన రెండు సినిమాలు కేవలం ఒకే వారం గ్యాప్ లో విడుదల అయ్యాయి. అందులో మొదటి విడుదల అయినా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ గా నిలవగా , ఆ తర్వాత వారం రోజులకు విడుదల అయిన సినిమా ఏకంగా టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. మరి ఆ సినిమాలు ఏవి ..? వాటి వివరాలు ఏమిటి తెలుసుకుందాం.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఆర్తి అగర్వాల్ హీరోయిన్గా బి గోపాల్ "అల్లరి రాముడు" అనే మూవీ ని రూపొందించాడు. ఈ సినిమాలో నగ్మా ఓ కీలకమైన పాత్రలో నటించింది. మంచి అంచనాల నడుమ ఈ సినిమా 2002 వ సంవత్సరం జూలై 18 వ తేదీన విడుదల అయింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఏ మాత్రం మెప్పించలేకపోయింది. దానితో ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది. ఇక ఈ సినిమా విడుదల అయిన వారం తర్వాత బి గోపాల్ దర్శకత్వంలో రూపొందిన ఇంద్ర మూవీ విడుదల అయింది. ఇంద్ర మూవీ లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించగా ... ఆర్తి అగర్వాల్ , సోనాలి బింద్రే ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ 2002 వ సంవత్సరం జూలై 24 వ తేదీన విడుదల అయ్యి టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అలా కేవలం వారం రోజుల గ్యాప్ లో బి గోపాల్ దర్శకత్వంలో రూపొందిన రెండు సినిమాలు విడుదల కాక అందులో ఒకటి భారీ ప్లాప్ కాగా , మరొకటి ఏకంగా టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: