యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. మొత్తం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా యొక్క మొదటి భాగాన్ని సెప్టెంబర్ 27 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేశారు. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే మిక్స్ డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ కూడా ఈ సినిమా మంచి కలెక్షన్లను వసూలు చేసి ఇప్పటికే బ్రేక్ ఈవెన్ ఫార్మలాను కూడా కంప్లీట్ చేసుకుని ప్రస్తుతం లాభాలు అందుకుంటుంది.
ఇకపోతే ఈ సినిమా విడుదలకు ముందు మంచి స్థాయిలో ప్రచారాలను నిర్వహించిన ఈ మూవీ యూనిట్ ఈ సినిమా విడుదల అయ్యి బ్రేక్ ఇవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకునేంత వరకు సైలెంట్ గా ఉంది. ఇక బ్రేక్ ఈవెన్ అయ్యాక ఈ మూవీ హీరో అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ , దర్శకుడు కొరటాల శివ మళ్లీ వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. ఇకపోతే ఇప్పటికే దేవర మూవీ మంచి విజయం సాధించింది కాబట్టి ఈ సారి దేవర పార్ట్ 1 మూవీ కి గురించి కాకుండా దేవర పార్ట్ 2 మూవీ పై ప్రచారాలను చేస్తున్నారు. అది ఎలా అనుకుంటున్నారా ..? దేవర పార్ట్ 1 సినిమాలో చాలా విషయాలకు కంక్లూజన్ ను ఇవ్వలేదు.
ఇకపోతే ప్రేక్షకులు దేవర పార్ట్ 1 మూవీ లో గమనించని కొన్ని విషయాలను కూడా జూనియర్ ఎన్టీఆర్ , కొరటాల శివ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అలా చెప్పడం వల్ల దేవర పార్ట్ 2 మూవీ పై ప్రేక్షకుల్లో అంచనాలు పెరుగుతున్నాయి. అలా దేవర పార్ట్ 1 విడుదల అయిన వెంటనే దేవర 2 పై ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేందుకుగాను ఆ సినిమా ప్రమోషన్లను తెలివిగా చేస్తున్నట్లు కొంతమంది జనాలు అభిప్రాయ పడుతున్నారు.