ప్రభాస్ సాలిడ్ కటౌట్ కి పాన్ ఇండియా దాసోహం..!!

murali krishna

* ప్రభాస్ క్రేజ్ తో ఊగిపోతున్న పాన్ ఇండియా
 
* మాస్ ఎలివేషన్ కు పర్ఫెక్ట్ ఫిజిక్ ప్రభాస్ కే సొంతం
* తన రికార్డ్స్ తానే బ్రేక్ చేసుకుంటున్న ఏకైక స్టార్ హీరో ప్రభాస్..!!

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బిగ్గెస్ట్ పాన్ ఇండియా చిత్రాలతో ప్రభాస్ దూసుకుపోతున్నారు.. యాక్టింగ్ పరంగా ప్రభాస్ స్టైల్ వేరుగా ఉంటుంది.. పెదనాన్న కృష్ణం రాజు సపోర్ట్ తో ప్రభాస్ ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టాడు.. మొదటి సినిమా “ ఈశ్వర్” ప్రభాస్ కు అంతగా కలిసిరాకపోయిన ప్రభాస్ ను గ్రాండ్ గా పరిచయం చేసింది.. ఆ తరువాత వచ్చిన “రాఘవేంద్ర” సినిమా నటుడుగా మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది.. అయితే ప్రభాస్ కు మొదటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన సినిమా మాత్రం  “వర్షం”.. ఈ సినిమాలో ప్రభాస్ మాస్ పెర్ఫార్మన్స్ కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు.. ఇక ప్రభాస్ కెరీర్ ను మలుపు తిప్పిన సినిమా “ ఛత్రపతి “.. ఈ సినిమాతో ప్రభాస్ అప్పటి వరకు వున్న భారీ రికార్డ్స్ అన్నిటిని చేరిపేశాడు.. ఆ తరువాత ప్లాప్స్ వచ్చిన ఛత్రపతి క్రేజ్ మాత్రం తగ్గలేదు.. అయితే ప్రభాస్ కి ఒక ఊత పదం ఉండేది అందరిని “డార్లింగ్” అని పిలవడం ఆయనకీ అలవాటు.. ఆ ఊత పదం పైనే ప్రభాస్ సినిమా చేసి సూపర్ సక్సెస్ అందుకున్నారు..

అయితే ప్రభాస్ లోని మాస్ ని మరో కోణంలో చూపించిన సినిమా ‘మిర్చి’.. ఛాన్నాళ్లకు ప్రభాస్ తనకు సూట్ అయ్యే పక్కా మాస్ అండ్ కమర్షియల్ మూవీ చేసాడు.. ఈ సినిమా ప్రభాస్ కెరీర్ లోనే బెస్ట్ మూవీగా నిలిచింది.. ఇక ప్రభాస్ ని పాన్ ఇండియా హీరోని చేసిన బాహుబలి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. బాహుబలి తరువాత ప్రభాస్ రేంజ్ మారిపోయింది.. ప్రభాస్ కట్ ఔట్ చూస్తేనే పాన్ ఇండియా దాసోహం అయిపోతుంది.. ప్రభాస్ లాంటి ఫిజిక్, పర్ఫెక్ట్ బాడీ చూసి లేడీ ప్రేక్షకులు పడి చచ్చిపోతారు.. ప్రభాస్ కి లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ మిగిలిన హీరోల కంటే కాస్త ఎక్కువగానే వుంది..ప్రభాస్ సినిమా వస్తుంది అంటే చాలు థియేటర్స్ కి ఎగబడుతూ వుంటారు. కంటెంట్ ఉన్నోడికి కట్ ఔట్ చాలు అనే డైలాగ్ ప్రభాస్ కి బాగా సూట్ అవుతుంది..అయితే పాన్ ఇండియా రేంజ్ లో ఇంత క్రేజ్ తెచ్చుకున్న ప్రభాస్ లో స్టేజ్ ఫియర్ మాత్రం పోలేదు.. పబ్లిక్ ఫంక్షన్స్ లో ప్రభాస్ మాట్లాడేది చాలా తక్కువ. టాలీవుడ్ బెస్ట్ ఇంట్రోవర్ట్ ఎవరంటే ముందుగా ప్రభాస్ పేరే చెబుతారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: