కొండ సురేఖపై పరువు నష్టం దావా.. నాగార్జున ఏం డిమాండ్ చేశాడో తెలుసా?

praveen
తెలంగాణ మంత్రి కొండా సురేఖ ఇటీవల అక్కినేని ఫ్యామిలీ గురించి చేసిన వ్యాఖ్యలు ఎంత సంచలనంగా మారిపోయాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏకంగా విడాకులు తీసుకొని వేరుపడిన అక్కినేని నాగచైతన్య, సమంతల పర్సనల్ వ్యవహారానికి కూడా రచ్చకు ఈడ్చారు ఆమె. గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నాగార్జున ఎన్ కన్వెన్షన్ హాల్ను కూల్చుతామని.. ఐటి మినిస్టర్ కేటీఆర్ అన్నారని.. ఇక ఇలా ఎన్ కన్వెన్షన్ హాల్ కూల్చవద్దు అంటే కోడలు సమంతను తన దగ్గరకు పంపించాలని డిమాండ్ చేశాడని.. ఇదే విషయంపై నాగచైతన్య నాగార్జున సమంతను ఒత్తిడిచేశారు. కానీ సమంత ఒప్పుకోకపోవడంతో చివరికి విడాకులు ఇచ్చారు అంటూ కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు.

 కొండా సురేఖ చేసిన ఈ వ్యాఖ్యలు అటు సినీ పరిశ్రమలో పెద్ద దుమారం రేపాయ్. ఈ వ్యాఖ్యలపై సినీ ఇండస్ట్రీ మొత్తం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నటీనటులందరూ కూడా కొండా సురేఖ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని వెంటనే అక్కినేని ఫ్యామిలీకి క్షమాపణలు చెప్పాలి అంటూ డిమాండ్ చేశారు. అయితే ఈ విషయంపై నాగర్జున, సమంత, నాగచైతన్య  సహా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా స్పందించారు. అయితే కొండ సురేఖ అక్కినేని ఫ్యామిలీ గురించి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఇక నాగార్జున ఆమెపై పరువు నష్టం దావా వేశారు అన్న విషయం తెలిసిందే.

 తమ కుటుంబ గౌరవాన్ని ప్రతిష్టను దెబ్బతీసే విధంగా మంత్రి కొండా సురేఖ తీవ్ర వ్యాఖ్యలు చేశారు అంటూ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు నాగార్జున. ఈ క్రమంలోనే తమ కుటుంబ పరువుకు భంగం వాటిళ్లేలా మాట్లాడిన కొండ సురేఖ పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి అంటూ కోరారు. అంతకుముందే కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండించిన నాగార్జున.. ఇక ఇప్పుడు ఆమెపై న్యాయపోరాటానికి కూడా దిగారు. రాజకీయాల కోసం కొందరి వ్యక్తిగత జీవితాలను టార్గెట్ చేసుకోవడం సరికాదు అంటూ నాగార్జున అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇలా పరువు నష్టం దావా వేసిన నాగార్జున.. కొండ సురేఖ పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేయడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: