మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..నందమూరి తారకరామారావు మనవడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన ఎన్టీఆర్ అనతి కాలంలోనే తాతకు తగ్గ మనవడిగా నిరూపించుకున్నారు.. డైలాగ్ డెలివరీ లో కానీ, నటన పరంగా కానీ ఎన్టీఆర్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్..19 ఏళ్ల వయసులోనే ఆది సినిమాతో ఎన్టీఆర్ తిరుగులేని మాస్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు.. ఇక సింహాద్రి సినిమాతో టాలీవుడ్ గత రికార్థులన్నిటిని తుడిచి పెట్టేసాడు.. సింహాద్రి సినిమా ఎన్టీఆర్ ని తిరుగులేని స్టార్ హీరోని చేసింది.. ఎంతటి స్టార్ బ్యాక్ గ్రౌండ్ వున్నా కూడా ఆ హీరోకి టాలెంట్ లేకపోతే ఇండస్ట్రీ లో రాణించడం కష్టం..నందమూరి ఫ్యామిలీ స్టేటస్ వున్నా కూడా ఎన్టీఆర్ తన టాలెంట్ తో ఇండస్ట్రీ లో స్టార్ హీరోగా ఎదిగారు.. ఎంత ఎదిగిన కూడా ఒదిగి ఉండటం ఎన్టీఆర్ కే సాధ్యం.. తన తోటి హీరోలను ఎంతో ఆప్యాయంగా పలుకరిస్తాడు.. తనని ఇంతటి వాడిని చేసిన ఫ్యాన్స్ ని ఎన్టీఆర్ గుండెల్లో పెట్టుకుంటాడు..ఎల్లప్పుడూ అభిమానుల క్షేమాన్నే ఎన్టీఆర్ కోరుకుంటాడు.. తన ప్రతి సినిమా ఈవెంట్ లో కూడా అభిమానులను జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి అని చెబుతారు. అభిమానులకు ఎన్టీఆర్ ఇచ్చే వాల్యూ అటువంటిది..
ప్రస్తుతం తెలుగు సినిమా ఖ్యాతి గ్లోబల్ స్థాయికి చేరింది.. తెలుగులో ప్రతి స్టార్ హీరో కూడా పాన్ ఇండియా రేంజ్ సినిమాలు చేస్తున్నారు.. మంచి విజయాలు కూడా సాధిస్తున్నారు. కానీ వారికీ ఎన్టీఆర్ కి చాలా తేడా వుంది.. ఎన్టీఆర్ నిజంగా పాన్ ఇండియా హీరో అని చెప్పొచ్చు.ఎందుకంటే ఎన్టీఆర్ రీసెంట్ నటించిన దేవర మూవీ ప్రమోషన్స్ పాన్ ఇండియా వైడ్ జరిగిన సంగతి తెలిసిందే. తారక్ ప్రమోషన్స్ లో భాగంగా పలు షోలకు హాజరు కాగా అక్కడ తారక్ అద్భుతంగా హిందీలో మాట్లాడిన వీడియోలు వైరల్ అయ్యాయి..అలాగే కర్ణాటకకు వెళ్లిన సమయంలో కన్నడ భాషలో అదేవిధంగా చెన్నైకు వెళ్లిన సమయంలో తమిళంలో తారక్ అదరగొట్టారని చెప్పడంలో సందేహం లేదు..ఏ భాషలోనైనా అద్భుతంగా, అనర్ఘళంగా మాట్లాడే విషయంలో తారక్ కు ఎవరూ కూడా సాటిరారని చెప్పవచ్చు. ఈ ఒక్క విషయంలో జూనియర్ ఎన్టీఆర్ కు పోటీ ఇవ్వడం ఇతర స్టార్ హీరోలకు సైతం కష్టం, అసాధ్యమని చెప్పవచ్చు.